స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Neem Leaves benefits in Telugu : ఈ రోజుల్లో కాలుష్యం వల్లనో, వాతావరణం వల్లనో చాలామందికి చర్మంపై ఎలర్జీలు, దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. ఎన్ని రకాల ఖరీదైన సబ్బులు, క్రీములు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే మన అమ్మమ్మల కాలం నాటి ఒక పాత చిట్కా గురించి మీకు గుర్తు చేయాలని ఈ ఆర్టికల్ రాశాను.
స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేస్తే.. మన చర్మానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అసలు వేపాకుల స్నానం వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయో, దీన్ని ఎలా చేయాలో ఈ పోస్ట్‌లో వివరంగా చదివి తెలుసుకోండి.”
వేప చెట్లు మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వేపాకులలో ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేప ఆకులను మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.వేప ఆకులలో ఫ్యాటీ యాసిడ్లు, లిమోనోయిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

ముఖ్యంగా వేప ఆకులు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిలో వేప ఆకులను వేసి స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పొడి చర్మం ఉన్నవారిలో చర్మానికి అవసరం అయినా తేమ అందుతుంది.
చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలు అలానే ఉండేలా చేసి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. వేప ఆకులను పేస్ట్ గా చేసి శరీరానికి, ముఖానికి పట్టించి పావు గంట అయ్యాక స్నానం చేస్తే ఎటువంటి చర్మ సమస్యలు ఉండవు.
ఇలా వారానికి ఒకసారి చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలు కూడా పోయి యవ్వనంగా కనిపిస్తారు. వేప ఆకులు దొరకని వారికి మార్కెట్ లో వేప పొడి దొరుకుతుంది. అలాగే వేప నూనె కూడా ఉంటుంది. తాజా వేప ఆకులు దొరికితే వాటినే ఉపయోగించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

