Kitchenvantalu

వంటగదిలో గంటలు గంటలు కష్టపడుతున్నారా? ఈ చిట్కాలతో పనులన్నీ చిటికెలో పూర్తవుతాయి!

Kitchen Tips: ఉదయం నిద్ర లేవగానే కిచెన్ లోకి వెళ్తే చాలు.. పనులతో తల ప్రాణం తోకకు వస్తుంది కదా? హడావిడిగా వంట చేయడం, కూరగాయలు తరగడం, పిల్లలకి క్యారేజీలు కట్టడం.. అబ్బో ఇలా రోజులో సగం సమయం వంటగదిలోనే గడిచిపోతుంది.

కానీ, కొన్ని చిన్న చిన్న స్మార్ట్ చిట్కాలు తెలిస్తే ఈ పనులన్నీ ఎంత ఈజీగా అయిపోతాయో తెలుసా? గంటల తరబడి నిల్చొని కష్టపడే పనిలేకుండా, మీ శ్రమను సగానికి తగ్గించి కిచెన్ పనులను చిటికెలో పూర్తి చేసే కొన్ని అద్భుతమైన కిచెన్ హ్యాక్స్ (Kitchen Hacks) ఈరోజు మీకోసం తీసుకువచ్చాను.

అవేంటో తెలిస్తే ‘ఇవి ముందే తెలిస్తే ఎంత బాగుండు’ అని మీరే అనుకుంటారు. మరి లేట్ ఎందుకు, ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి!

వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే సమయం అదా అవ్వటమే కాకుండా డబ్బు కూడా అదా అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

పనస పండు తొనలు తీసే ముందు చేతులకు నూనె రాసుకుంటే జిగురు అంటుకోదు. లేదంటే చేతులకు అంటిన జిగురు ఒక పట్టాణా వదలదు.

రాగి గిన్నెల జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలకు రాళ్ల ఉప్పు చేర్చి రుద్దితే సరి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మరమరాలు కరకరలాడాలంటే గంట సేపు ఎండలో ఆరబెట్టి తీయాలి.

కూలర్లో కొంచెం రోజ్ వాటర్ కలిపితే గదంతా సువాసన వస్తుంది. కూలర్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు.

దొండ, చామదుంప, ఆలూ వంటి కూరలు రుచిగా వుండాలంటే వేగించిన జీలకర్ర పొడిని కలపాలి.

వేసవిలో కూరగాయలు త్వరగా వడలి పోకుండా వుండాలంటే తడి వస్త్రంలో చుట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.

గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరవాలంటే నిమ్మకాయల డిప్పలను ఉడికించి …..ఆ నీటిలో స్పాంజిని ముంచి తుడవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."