Beauty TipsHealthhealth tips in telugu

నల్లటి మోకాళ్లు, మోచేతులు ఇట్టే తెల్లబడాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే!

Lighten dark knees And elbows: ముఖం ఎంత గ్లో గా ఉన్నా.. మోచేతులు, మోకాళ్ల దగ్గర డార్క్ గా ఉంటే అదోలాంటి ఇబ్బంది కదా! నచ్చిన స్లీవ్‌లెస్ టాప్స్ లేదా షార్ట్స్ వేసుకోవాలంటే ఎక్కడలేని మొహమాటం వచ్చేస్తుంది.

బయట దొరికే క్రీమ్స్ వాడినా పెద్దగా రిజల్ట్ ఉండదు. కానీ, మన ఇంట్లో ఉండే కొన్ని సింపుల్ వస్తువులతోనే ఈ నలుపును ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటో, వాటిని ఎలా వాడాలో ఈ బ్లాగ్‌లో క్లియర్ గా రాశాను. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది!

ముఖం మరియు శరీరం అంతా తెల్లగా ఉండి మోకాళ్ళు, మోచేతుల మీద నలుపు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ నలుపును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక షాంపూ పేకెట్ లో షాంపూను వేయాలి. దానిలో అరచెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల టమోటా రసం, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై నలుపు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా,నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడతాయి. ఆర్గానిక్ పసుపు వాడితే మంచిది. షాంపూ ఏ కంపెనీ అయిన పర్వాలేదు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది.

ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. పెద్దగా ఖర్చు పెట్టకుండా మంచి పలితాన్ని పొందవచ్చు. ప్రతి చిన్న విషయానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే అన్ని వస్తువులు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి మోకాళ్ళు, మోచేతుల మీద ఉన్న నలుపును తొలగించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."