నొప్పులన్నీ మాయం చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా.. ఎలా తయారు చేయాలి?
Joint pains home remedies In Telugu :వఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఉదయం నిద్ర లేవగానే కింద కాలు పెట్టాలన్నా, చిన్న మెట్టు ఎక్కాలన్నా నరకం కనిపిస్తోంది కదూ? హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడి విసిగిపోయారా?
అయితే మీలాంటి వారి కోసమే ఈ చిన్న చిట్కా. మన వంటింట్లో దొరికే వస్తువులతోనే రోజుకు ఒక స్పూన్ తయారు చేసుకుని వాడితే చాలు, అద్భుతమైన మార్పు మీకే తెలుస్తుంది. అదేంటో, ఎలా తయారు చేయాలో ఒకసారి చదివి చూడండి.
మన శరీరంలో శరీర బరువును మోసే ముఖ్యమైన అవయవం మోకాళ్ళు. ఈ మధ్యకాలంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం,వ్యాయామం చేయకపోవటం,పోషకాహార లోపం వంటి కారణాలతో చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి.

ఈ నొప్పులకు ఎక్కువ కాలం మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నొప్పులు ప్రారంభదశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. దాని కోసం ఒక మంచి ఆయుర్వేద రెమిడి తెలుసుకుందాం
ఒక బౌల్లో ఒక స్పూన్ తేనె తీసుకోవాలి దానిలో పావు స్పూను నువ్వుల పొడి,పావు స్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపి ఉదయం సమయంలో ఒకసారి సాయంత్రం సమయంలో ఒకసారి తీసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది
మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ లో తేనె గురించి చెప్పుకుంటే తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి.
ఇక నువ్వుల విషయానికి వస్తే నువ్వులలో ఉండే సేసమిన్ అనే సమ్మేళనం, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మృదులాస్థిని రక్షించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. శొంఠిలో ఉన్న లక్షణాలు కూడా నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి.
ఈ మిశ్రమాన్ని కొన్ని రోజుల పాటు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది ఒక విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ ఇంటి చిట్కాలు కూడా ఫాలో అయితే తొందరగా మంచి .ఉపశమనం కలుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

