Kitchenvantalu

వర్షాకాలంలో అన్నం, కూరలు త్వరగా పాడవుతున్నాయా? అయితే ఈ బెస్ట్ కిచెన్ టిప్స్ మీకోసమే!

Monsoon Kitchen Tips: వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడి హాయిగా ఉంటుంది కానీ.. మన వంటగదిలో మాత్రం ఒక చిన్న టెన్షన్ మొదలవుతుంది కదూ! గాలిలో ఉండే తేమ వల్ల పొద్దున వండిన అన్నం, కూరలు సాయంత్రానికే పాడైపోతుంటాయి.

ఫ్రిజ్‌లో పెట్టడం మర్చిపోతే ఇక అంతే సంగతులు. ఇలా వర్షాకాలంలో ఫుడ్ త్వరగా పాడవకుండా, ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆ స్మార్ట్ ట్రిక్స్ ఏంటో, వండిన ఆహారాన్ని ఎలా భద్రపరుచుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా రాశాను. మీ కిచెన్ టెన్షన్స్ తగ్గించుకోవడానికి వెంటనే ఈ ఆర్టికల్ చదివేయండి!
Storing foods in fridge
వర్షాకాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వండిన ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. ఒక్కోసారి వర్షాకాలంలో ఆహార పదార్థాలు బూజు పట్టి పాడైపోతూ ఉంటాయి. చెమ్మ, తేమ వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవుతాయి.

ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే వంట గదిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి. వంట గదిలో గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. గదిలోని కిటికీలు, తలుపులను తెరిచి ఉంచాలి. గాలి చల్లగా రావడానికి ఫ్యాన్ వాడవచ్చు. వంటగది ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాలను నిలువ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించాలి.

మాంసాలు, చీజ్‌ల వంటి తొందరగా పాడైపోయే వాటిని తప్పనిసరిగా ఫ్రిజ్ ఉంచి, వాటి ఎక్ప్సైరీ డైట్ దాటిపోకుండా వాడేసేలా చూసుకోండి. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏమిటంటే వర్షాకాలంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగినట్లయితే, వంటగదిలో వేడిని తగ్గించడానికి కొంత సమయం పాటు ఫ్యాన్‌లను ఆఫ్ చేయాలి. ఇలా చేయటం వలన ఆహారం తేమ కారణంగా పాడవకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."