Healthhealth tips in telugu

రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఈ నూనెతో మసాజ్ చేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతం ఇదే!

Foot massage health benefits : రోజంతా ఆఫీసు పనులు, ఇంటి పనులతో అలిసిపోయి రాత్రికి మంచం మీద వాలగానే వెంటనే నిద్ర పడుతుందా? చాలామందికి నిద్ర రాక, ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఎలాంటి మందులు వాడకుండా, ఎంతో ప్రశాంతంగా నిద్రపోవడానికి మన పెద్దవాళ్లు చెప్పిన ఒక చిన్న చిట్కా ఉంది.

అదే అరికాళ్ళ మసాజ్. రాత్రి పడుకునే ముందు కేవలం 5 నిమిషాల పాటు ఈ నూనెతో అరికాళ్లకు మసాజ్ చేస్తే మన శరీరంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఏ నూనె వాడాలి, ఎలా మసాజ్ చేసుకోవాలో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం రండి!

ప్రతి రోజు రాత్రి సమయంలో ఆరికాళ్ళకు నూనెతో మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మన అరికాళ్ళలో ఉన్న కొన్ని పాయింట్స్ నరాలకు అనుసందానం అయ్యి ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో నూనెతో మసాజ్ చేస్తే ఆ నరాలు యాక్టివేట్ అయ్యి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
Powerful Pain Killer oil
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ బాదం నూనె,ఒక స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా కలిపి కొంచెం వేడి చేసి అరికాళ్ళకు మసాజ్ చేయాలి. ఈ నూనెలలో ఉన్న పోషకాలు నొప్పులను తగ్గిస్తాయి. ఈ నూనెను ఎక్కువ మోతాదులో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి.

రక్తప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా పాదాల తిమ్మిర్లు,చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. వారికి కూడా ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. పాదాల నుండి మోకాళ్ళ వరకు నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.

ఈ నూనెను రెండు చుక్కలు తీసుకొని నాబిలో వేసి మసాజ్ చేయటం వలన కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మంచి నిద్ర పడుతుంది. నిద్రలేని సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."