Healthhealth tips in telugu

ప్యాకెట్ పాలను పదే పదే మరిగిస్తున్నారా? అయితే ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!

ఉదయం లేవగానే వేడి వేడి పాలు తాగడం, కాఫీ టీలు కలుపుకోవడం మన దైనందిన జీవితంలో ఒక భాగం. అయితే, మనం రోజూ కొనుక్కునే ప్యాకెట్ పాలను నిజంగానే మరిగించాలా? చాలామంది ప్యాకెట్ పాలను కూడా మామూలు పాలలాగే ఎక్కువసేపు మరిగిస్తుంటారు.

కానీ అలా చేయడం వల్ల పాలలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదు? పాశ్చరైజేషన్ అంటే ఏమిటి? ప్యాకెట్ పాలను ఎలా వాడితే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహారాల జాబితాలో మొద‌టి స్థానంలో ఉంటాయి.పాల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.

పిల్ల‌లు త్వ‌ర‌గా స‌రైన రీతిలో ఎదుగుతారు.అయితే పాల‌ను తాగాలంటే వాటిని ఎవ‌రైనా మ‌రిగించాల్సిందే.దాంతో పాల‌లో ఉండే హానిక‌ర‌మైన బాక్టీరియా న‌శిస్తుంది.కానీ నేటి త‌రుణంలో చాలా మంది ప్యాకెట్ పాల‌ను కూడా మ‌రిగిస్తున్నారు.

అయితే నిజానికి అలా చేయ‌రాదు తెలుసా.? అవును, మీరు విన్న‌ది నిజ‌మే.ప్యాకెట్ పాల‌ను మ‌రిగించాల్సిన ప‌నిలేదు.సింపుల్‌గా కొంచెం వేడి చేసుకుని ఉప‌యోగిస్తే చాలు.కానీ అది తెలియ‌ని చాలా మంది వాటిని బాగా మ‌రిగిస్తున్నారు.అయితే ప్యాకెట్ పాల‌ను మ‌రిగించాల్సిన అవ‌స‌రం ఎందుకు లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఏ డెయిరీలో అయినా పాల‌ను అధిక ఉష్ణోగ్ర‌త‌కు మ‌రిగిస్తారు.161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు పాల‌ను మ‌రిగించి వెంట‌నే 15 సెకండ్ల‌లోనే చ‌ల్లారుస్తారు.ఇలా చేయడాన్ని పాశ్చ‌రైజేష‌న్ అంటారు.

దీని వ‌ల్ల పాల‌లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది.అయితే ఇలా ఒక‌సారి మ‌రిగించాక ఆ పాల‌ను ప్యాక్ చేస్తారు. అనంత‌రం వాటిని మ‌నం మ‌ళ్లీ మ‌రిగిస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు నశిస్తాయి.

క‌నుక ప్యాకెట్ పాల‌ను మ‌ళ్లీ మ‌రిగించాల్సిన ప‌నిలేదు.కాక‌పోతే చ‌ల్ల‌గా ఉంటాయ‌నుకుంటే కొద్దిగా వేడి చేసి తాగ‌వచ్చు.కానీ మ‌రిగించ‌రాదు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను క‌చ్చితంగా మ‌రిగించాలి.

దాంతో ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా న‌శిస్తుంది.అప్పుడు ఆ పాల‌ను నిర‌భ్యంత‌రంగా వాడుకోవ‌చ్చు.క‌నుక ఇక‌పై ఎవ‌రూ ప్యాకెట్ పాల‌ను మ‌రిగించకండి.ఈ విష‌యాన్ని అంద‌రికీ తెలియ‌జేయండి.అలా చేస్తే ఎంతో విలువైన ఇంధ‌నాన్ని ఆదా చేయ‌వ‌చ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."