Healthhealth tips in telugu

నెయ్యి ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అతిగా తింటే చాలా డేంజర్!

Ghee Side Effects : వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ముద్దపప్పు కలుపుకుని తింటే ఆ రుచే వేరు కదా! నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని, బలాన్ని ఇస్తుందని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. నిజమే.. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కానీ, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్లు దేన్నైనా మితంగా తీసుకుంటేనే ఔషధం.

ఆరోగ్యానికి మంచిదని రోజువారీ డైట్‌లో నెయ్యిని ఎక్కువగా లాగించేస్తున్నారా? అయితే మీరు ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. నెయ్యి అందరికీ పడదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇంతకీ నెయ్యిని ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఏయే సమస్యలు ఉన్నవారు నెయ్యిని అవాయిడ్ చేయాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా మాట్లాడుకుందాం రండి.

మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ ఆహారం మరియు సంస్కృతిలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. నెయ్యిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ కె వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి…కొన్ని సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. అజీర్ణం, అల్సర్లు,పొత్తికడుపులో నొప్పి వంటి పొట్టకు సంబందించిన సమస్యలు ఉన్నవారు నెయ్యి తినటం మంచిది కాదు.

సిర్రోసిస్ కాలేయ వ్యాధి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతిన్న కణజాలంతో భర్తీ చేయబడుతుంది.

ఫలితంగా కాలేయం శాశ్వతంగా దెబ్బతింటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు నెయ్యి తినకూడదు. అంతేకాకుండా ప్లీహము పెద్దగా ఉన్నా నెయ్యి తినకూడదు. జ్వరం వచ్చినప్పుడు నెయ్యి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జ్వరాలలో నెయ్యి శరీరంలో జీర్ణక్రియను నెమ్మది చేసి కఫం పేరుకుపోయేలా చేస్తుంది.

కాబట్టి జ్వరం, జలుబు మరియు ఫ్లూ ఉన్న సమయంలో వీలైనంత వరకు నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. నెయ్యి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు నెయ్యిని తినకూడదు. బరువు తగ్గాలనుకునే వారు .కూడా నెయ్యిని తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

హెపటైటిస్ అనేది ఒక ప్రమాదకరమైన కాలేయ వ్యాధి. ఈ సమస్య ఉన్నవారు తమ ఆహారంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం.

హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పుడు కాలేయం వాపు కారణంగా కాలేయం జీర్ణక్రియలో నిదానిస్తుంది. కాబట్టి నెయ్యి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."