Kitchenvantalu

ఇడ్లీ, దోసల్లోకి బండి మీద దొరికే కారం చట్నీ.. 5 నిమిషాల్లో ఇంట్లోనే!

Hotel Style Red Chutney: వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసల్లోకి.. హోటల్స్ లో లేదా బండి మీద ఇచ్చే ఆ ఎర్రటి కారం చట్నీ నంజుకుని తింటుంటే అబ్బా.. ఆ మజాయే వేరు కదూ! కానీ ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ రంగు, ఆ పక్కా రుచి రావడం లేదా?

అయితే ఈ పోస్ట్ మీకోసమే. ఉదయం హడావిడిలో కేవలం 5 నిమిషాల్లో పక్కా హోటల్ స్టైల్ రెడ్ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఒక్కసారి ఈ చట్నీ చేశారంటే, మీ ఇంట్లో వాళ్ళు ఇంకో రెండు ఇడ్లీలు ఎక్కువే అడిగి మరీ లాగించేస్తారు. రండి, ఈ టేస్టీ చట్నీ సీక్రెట్ ఏంటో చూసేద్దాం!

ఇడ్లీ,దోశ,ఉప్మా టిఫిన్ ఏదైనా చట్నీ కామన్ గా చేసుకోవాల్సిందే. రెగ్యులర్ గా పల్లీ,కొబ్బరి చట్నీ బోర్ కొడితే ఈజీగా చేసుకునే రాయలసీమ స్టైల్ రెడ్ చట్నీ చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
టమాటోలు – ½ కప్పు
ఉల్లిపాయలు – ½ కప్పు
ఎండుమిర్చి – 5-6
చింతపండు – 5 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
తాలింపు గింజలు – తగినన్ని

తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి ఉల్లిపాయలు,టమాటోలు,చింతపండు ,ఉప్పు వేసి పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి.
2.తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసుకోవాలి.
3.వేడెక్కిన ఆయిల్ లో శనగ పప్పు,ఎండుమిర్చి ముక్కలు,జీలకర్ర ,ఆవాలు,పసుపు వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.వేగిన తాలింపులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్ర చట్నీని వేసి కలుపుకోవాలి.
5.అంతే చిటికెలో టిఫిన్ కోసం ఎర్ర చట్నీ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."