Beauty TipsHealthhealth tips in telugu

ఈ డికాషన్ తలకు పట్టిస్తే చాలు… చుండ్రు మాయమై, జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది!

Fenugreek Seeds Hair Growth Tips: నేటి కాలుష్యం, ఒత్తిడి మరియు జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిని వేధించే ప్రధాన సమస్యలు చుండ్రు మరియు జుట్టు రాలడం. ఖరీదైన షాంపూలు, కెమికల్ ప్రొడక్ట్స్ వాడినా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు.

అయితే వంటింట్లోని సహజ మూలికలతో తయారుచేసే ఈ ప్రత్యేక హెయిర్ డికాషన్ (హెర్బల్ టోనర్) మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, చుండ్రును పూర్తిగా నివారిస్తుంది.

అంతేకాకుండా జుట్టు ఎదుగుదలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన డికాషన్‌ను ఎలా తయారు చేసుకోవాలి, తలకు ఎలా అప్లై చేయాలి మరియు సరైన ఫలితాల కోసం పాటించాల్సిన నియమాలను ఈ ఆర్టికల్‌లో సమగ్రంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో మనలో చాలా మంది ఈ సమస్యలు ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .

అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా శ్రద్ధగా సమయాన్ని కేటాయిస్తే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల మెంతులను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ల రోజ్ మేరీ ఆకులను వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ ఆముదము., ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపితే ఒక వైట్ క్రీమ్ లా తయారవుతుంది. .

రోజ్ మేరీ, మెంతుల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్త నీటిని పోసి వడగట్టి జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో ఆముదం మరియు అలోవెరా జెల్ క్రీమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. .

ఆ తర్వాత ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మెంతులు మన జుట్టుకు ఒక సంజీవిని వంటిది అని చెప్పవచ్చు.

జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి బాగా సహాయపడతాయి. రోజ్ మేరీ ఆకులు ఆన్లైన్ స్టోర్స్ లో లభ్యమవుతాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో బాగా సహకరిస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."