Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలే సమస్యకు బెస్ట్ రెమెడీ.. ఉల్లి రసంతో ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం!

Hair Fall Tips In telugu :కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల నేటి రోజుల్లో స్త్రీ, పురుషులు ఇద్దరినీ వేధించే ప్రధాన సమస్య తీవ్రమైన జుట్టు రాలడం. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా ఫలితం లేక చాలామంది నిరాశ చెందుతుంటారు. అయితే మన వంటింట్లో లభించే ఉల్లిపాయ రసం జుట్టు సంరక్షణకు ఒక అద్భుతమైన సహజ ఔషధంలా పనిచేస్తుంది.

ఉల్లిపాయలో ఉండే పుష్కలమైన సల్ఫర్ కంటెంట్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, ఊడిన ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వేగంగా మొలవడం మొదలవుతాయి. ఈ పోస్ట్‌లో ఉల్లిపాయ రసాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారుచేసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు ఎలా అప్లై చేయాలో వివరంగా తెలుసుకుందాం.

జుట్టుకి సంబందించిన సమస్యలు తగ్గాలంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనపడుతుంది.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా ఇంటి చిట్కాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీని కోసం జామ ఆకులు, ఉల్లిపాయ, మెంతులు ఉపయోగిస్తున్నాం. పొయ్యి మీద గిన్నె పెట్టి 4 జామ ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తొక్కలు తీయకుండా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులను వేసి బాగా 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన ఈ నీటిని వడకట్టి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. జామ ఆకులలో ఉండే విటమిన్ బి జుట్టు రాలకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. అలాగే యాంటి మైక్రోబియల్ లక్షణాలు తల మీద చర్మాన్ని శుభ్రం చేస్తాయి.

జామ ఆకుల్లో ఉండే విటమిన్ సి అనేది కొల్లజన్ యాక్టివిటీ మెరుగుపరిచి జుట్టు ఎలాస్టిసిటీ ని పెంచుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు రాలటానికి కారణం అయిన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయ జుట్టు సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బలంగా, ఆరోగ్యంగా,ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులు చుండ్రును తగ్గించటానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. mentulu కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."