Uncategorized

ఈ పండుతో కేవలం 15 నిమిషాల్లో ముఖంపై గ్లో.. మచ్చలు పరార్!

Pimples Home remedies In telugu

Pimples Home remedies In telugu

Pimples Home remedies :ఎండల తీవ్రత, వాయు కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై మొటిమలు (Acne), నల్ల మచ్చలు (Dark Spots) మరియు పిగ్మెంటేషన్ రావడం చాలామందిలో చూస్తుంటాం. వీటిని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన కాస్మెటిక్స్ వాడటం వల్ల చర్మం మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

సహజసిద్ధమైన పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎంజైములు చర్మ కణాలను లోపలి నుంచి శుభ్రపరిచి సహజమైన నిగారింపును అందిస్తాయి. ఈ పండు గుజ్జుతో ఇంట్లోనే సులభంగా ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్లు తొలగిపోయి, మచ్చలు క్రమంగా తగ్గి ముఖం తాజాగా మెరుస్తుంది.

ఈ పోస్ట్‌లో ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ తయారీ విధానం, అప్లై చేసే సరైన పద్ధతి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ అందమైన ముఖం ఉండాలని కోరుకుంటారు. మనలో చాలా మందికి ముఖం మీద మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు.

చాలా తక్కువ ఖర్చులో మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మారేలా చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తాగే ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే డ్రాగన్ ఫ్రూట్ లో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్, అర స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా బియ్యప్పిండి లేదా సెనగపిండి, ఒక స్పూను పచ్చి పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ లో ఎటువంటి కెమికల్స్ లేవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు.

డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో చాలా విరివిగానే లభ్యం అవుతుంది. ఈ ప్యాక్ వేసుకోవటం వలన ముడతలు తగ్గటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

The post ఈ పండుతో కేవలం 15 నిమిషాల్లో ముఖంపై గ్లో.. మచ్చలు పరార్! appeared first on Chai Pakodi.