Kitchenvantalu

అమ్మమ్మల కాలం నాటి బెండకాయ పులుసు.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నం మొత్తం లాగించేస్తారు!

Bendakaya Pulusu Recipe: తెలుగువారి వంటకాల్లో పులుసు కూరలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ పాతకాలపు పద్ధతిలో మట్టిపాత్రలో చేసిన బెండకాయ పులుసు వాసన, రుచి ఎప్పటికీ మర్చిపోలేం. సరైన కొలతలతో, సంప్రదాయ పద్ధతిలో పులుసు పెడితే వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే అమృతంలా ఉంటుంది.

చాలామందికి బెండకాయ పులుసు చేసేటప్పుడు ముక్క జిగురు రావడం, పులుసు పల్చగా నీళ్లలా మారడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా జిగురు లేకుండా, చిక్కటి గ్రేవీతో అమ్మమ్మల చేతి రుచి వచ్చేలా బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ పోస్ట్‌లో కావాల్సిన పదార్థాలు మరియు పూర్తి తయారీ విధానంతో వివరంగా చూద్దాం.

లేత బెండకాయలు, ఫ్రైకి ఎంత ఫేమసో, కాస్త ముదిరిన బెండకాయలతో పులుసు.. అంతే ఫేమస్. పుల్లపుల్లగా , స్పైసీ, స్పైసీగా బెండకాయ పులుసు ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బెండకాయ ముక్కలు – 300 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిశనగరప్పు – 1 టీస్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
ఎల్లిపాయ తరుగు – ½ కప్పు
పచ్చిమిర్చి – 4
ఎండుమిర్చి – 2
పసుపు – ¼ టీ స్పూన్
దంచిన వెల్లుల్లి – 5
చింతపండు గుజ్జు – 400ml
శనగపిండి నీళ్లు – 1 టేబుల్ స్పూన్
బెల్లం – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో ఆవాలు, మెంతులు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు వేసుకుని, వేపుకోవాలి.
2. వేగిన తాళింపులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేసి, వేపుకోవాలి.
3. వేగిన ఉల్లిపాయల్లో, పసుపు, బెండకాయ ముక్కలు వేసి, కలుపుకుని, 5 నిముషాల పాటు వేపాలి.

4. వేగిన బెండకాయ ముక్కల్లో, చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం వేసి, బెండకాయలు మెత్తపడేవరకు, మీడియం ఫ్లేమ్ పై మూత పెట్టుకుని, ఉడికించాలి.
5. బెండకాయలు మెత్తపడిన తర్వాత, పల్చగా కలుపుకున్న శగనపిండి నీళ్లు పోసి, మరో మూడు నిముషాలు ఉడికించి, దించేసుకోవాలి.
6. అంతే, బెండకాయ పులుసు తయారు అయినట్టే..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."