Healthhealth tips in telugu

ఈ ఎర్రటి కాయల వెనుక ఉన్న రహస్యం తెలిస్తే.. ఇక అసలు వదిలిపెట్టరు!

Roselle Fruit Benefits In telugu : మనం నిత్యం చూసే ఎన్నో మొక్కల్లో మనకు తెలియని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ ‘రోసెల్’ (Roselle). చూడటానికి ఎర్రగా, ఆకర్షణీయంగా ఉండే ఈ కాయల గురించి బహుశా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది.

కానీ, వీటిలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కాయలను ఎందుకు వదిలిపెట్టకూడదు? వీటిని వాడటం వల్ల మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ఇది చదివాక మీరే అంటారు.. “ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఎంత మిస్ అయ్యామో” అని!

పుల్లని రుచితో ఉండే గోంగూర అంటే మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోంగూరతో పచ్చడి,పప్పు చేసుకుంటారు. గోంగూరలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే గోంగూర కాయలలో కూడా చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు.
Health benefit of sorell roselle flowers
ప్రతి రోజు 2 గోంగూర కాయలను తింటే చాలా మంచిది.ఈ కాయలు పైన ఎర్రని రేకలను కలిగి లోపల గింజ ఉంటుంది. ఎర్రని రేకలతో పప్పు, పచ్చడి వంటివి చేసుకుంటారు. గోంగూర కాయలు కూడా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగు తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.

డయబెటిస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. గ్లాస్ నీటిలో 2 లేదా 3 గోంగూర కాయల రేకలను వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

మెదడు పనితీరు మెరుగుపడి వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు తగ్గి జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది. కిడ్నీలు శుభ్రం అవ్వటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."