Beauty TipsHealthhealth tips in telugu

చర్మం పగులుతోందా? అయితే మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉండాల్సిందే!

హలో ఫ్రెండ్స్! చలికాలం వచ్చినా, ఏసీ రూమ్‌లో ఎక్కువసేపు కూర్చున్నా.. ముందుగా మనకి గుర్తొచ్చే ప్రాబ్లమ్ ‘డ్రై స్కిన్’. చర్మం పగిలిపోయి, గీతలు పడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ! మార్కెట్లో దొరికే రకరకాల బాడీ లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడి విసిగిపోయారా? అయితే అసలు ప్రాబ్లమ్ బయట కాదు, లోపల ఉందని గమనించండి.

అవునండీ.. మనం తినే ఆహారమే మన చర్మం అందాన్ని నిర్ణయిస్తుంది. మరి ఏయే ఫుడ్స్ తింటే చర్మం పగలకుండా, ఎప్పుడూ స్మూత్‌గా, బేబీ స్కిన్‌లా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం రండి!

చలికాలంలో చర్మం పగలటం సహజమే. చర్మం పగిలితే అసహ్యంగా ఉండటమే కాకుండా చాలా చికాకును కలిగిస్తుంది. ఈ సమస్య నుండి ఎలా బయట పడాలో అర్ధం కాకా చాల ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారటమే కాక పగిలే సమస్య తగ్గుతుంది. ఇప్పడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం. విటమిన్ సమృద్ధిగా ఉండే ఆరెంజ్‌, నిమ్మ‌, గ్రేప్ ఫ్రూట్స్‌, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో ఉండే విట‌మిన్ సి ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చ‌ర్మానికి హాని చేసే బాక్టీరియాను తొలగించి చర్మ పగుళ్ళను తగ్గిస్తుంది. 

బాదం పప్పు 
బాదం ప‌ప్పులో విట‌మిన్ ఇ స‌మృద్ధిగా సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. అలాగే సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. 

దానిమ్మ 
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చ‌ర్మాన్ని నాశ‌నం చేసే బాక్టీరియాను చంపేస్తాయి. దాంతో చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. 

చేపలు 
చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం పగలకుండా సంరక్షిస్తాయి. వారంలో రెండు సార్లు చేపలు తింటే మంచిది. 

అవిసె గింజలు 
అవిసె గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం మిగలకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. 

డార్క్ చాకోలెట్ 
డార్క్ చాకొలేట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా పగలకుండా సంరక్షణ చేస్తుంది. 

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com