Kitchenvantalu

కచ్చితమైన కొలతలతో మద్రాస్ వెన్ పొంగల్.. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోవాల్సిందే!

Madras Ven Pongal: ఉదయం వేడి వేడిగా బ్రేక్‌ఫాస్ట్‌లో అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టెపొంగలి తింటుంటే.. ఆ నెయ్యి సువాసనకు మనసంతా నిండిపోతుంది కదూ! కమ్మగా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే తమిళనాడు స్పెషల్ ‘మద్రాస్ వెన్ పొంగల్’ (Madras Ven Pongal) అంటే ఇష్టపడని వారుండరు.

కానీ మనం ఇంట్లో చేస్తే ఆ పర్ఫెక్ట్ రుచి, ఆ కన్సిస్టెన్సీ ఎందుకో సరిగ్గా రాదు. అయితే నేను చెప్పే ఈ పక్కా కొలతలతో, చిన్న చిన్న ట్రిక్స్‌తో ఒక్కసారి చేసి చూడండి.. అచ్చం హోటల్‌లో, గుడిలో తిన్న ఫీలింగ్ ఖాయం! ఈ అద్భుతమైన రెసిపీని ఇంట్లోనే ఎంత సులభంగా తయారు చేయాలో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం రండి.

టెంపుల్స్ లో పూజల సమయంలో,చేసుకునే పొంగల్ ఎలా తయారు చేయాల్లో చూద్దాం. బియ్యం పెసరపప్పుతో, ఉడికించి, మిర్యాల ఘాటు తగిలించి, కమ్మని మదరాసీ పొంగల్ తయారీ చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కొత్త బియ్యం – 1 కప్పు
పెసరపప్పు – 1/2కప్పు
ఉప్పు –సరిపడా
కరివేపాకు – 5 రెమ్మలు
నీళ్లు – 4.5 కప్పు
నెయ్యి – 1/2కప్పు
జీడిపప్పు – 1/2కప్పు
మిరియాలు – 1/2టేబుల్ స్పూన్
అల్లం తురుము – 1.5 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2టేబుల్ స్పూన్
ఇంగువ – 1/2టీ స్పూన్

తయారీ విధానం
1.బియ్యం పెసరపప్పు, శుభ్రంగా కడిగి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి, గంట పాటు నాన పెట్టుకోవాలి.
2.గంట తర్వాత, కుక్కర్ లో నానిన బియ్యం కప్పు, నీళ్లు , ఉప్పు వేసి, మీడియం ఫ్లేమ్ పై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.పొంగల్ ఉడికిన తర్వాత, రెండు చంచాల నెయ్యి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.

4.ఇప్పుడు వేరొక ప్యాన్ లో నెయ్యి వేడి చేసి, మిరియాలు వేసి, చిత్లాక, అల్లం తురుము వేసుకోవాలి.
5. వేగిన అల్లం తురుములో, జీలకర్ర, జీడిపప్పు, వేసుకుని, మరో రెమ్మ కరివేపాకు వేసి, చివరగా, ఇంగువ వేసి,పోపు ఎర్రగా వేపుకోవాలి.
6. వేగిన తాళింపులో పొంగల్ లో వేసి కలుపుకుని, చివరగా రెండు చెంచాల నెయ్యి వేసి, మూత పెట్టి 10 నిముషాల తర్వాత సెర్వ్ చేసుకుంటే, కమ్మటి పొంగల్ రెడీ అయినట్లే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."