Kitchenvantalu

కాకరకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తినే అద్భుతమైన కాకరకాయ కారం!

Kakarakaya Kaaram: కాకరకాయ అనగానే చేదు అని ఆమడ దూరం పరిగెత్తే వారు కూడా లొట్టలేసుకుంటూ తినే అద్భుతమైన రెసిపీ ఈ ‘కాకరకాయ కారం’.

అస్సలు చేదు లేకుండా, కమ్మగా ఉండే ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఆ రుచే వేరు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే రోజూ కంచం మొత్తం దీనితోనే ఖాళీ చేసేస్తారు! ఈ స్పెషల్ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

రుచిలో చేదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయలు ఎలా చేసుకున్న రుచిగానే ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి కాకరకాయం కారం ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయ – ½ kg
ఎండుమిర్చి – 7-8
మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్
శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్
వెల్లల్లి రెబ్బలు – 20
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
చింతపండు – 20 గ్రాములు
పసుపు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను పై పొట్టిచాప్ చేసుకోని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి వేడెక్కాక మినపప్పు,శనగపప్పు,ధనియాలు వేసి వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే బాండీలో ఎండుమిర్చి వేసి వేపి పక్కన పెట్టుకోవాలి.
4.అదే బాణీలో కాకరకాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
5.అందులోకి ఉప్పు వేసి మీడియం మంటపై బాగా వేపుకోవాలి.
6.మిక్సి జార్ లోకి ముందుగా వేపుకున్న పప్పును,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,ఉప్పు,వేపుకున్న ఎండుమిర్చి ,చింతపండు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
7.వేపుకున్న కాకరకాయ ముక్కలలో గ్రైండ్ చేసుకున్న పొడిని కలుపుకోని బాగా మిక్సి చేసుకుని కంటేనర్ లో స్టోర్ చేసుకోని రెండు వారలా వరకు యూజ్ చేసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."