Beauty TipsHealthhealth tips in telugu

ఎంతటి మొండి చుండ్రు అయినా సరే.. ఈ చిట్కాతో మాయం అవ్వాల్సిందే!

Dandruff Home Remedies: ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న చుండ్రు (Dandruff) సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలా? ఎలాంటి రసాయనాలు వాడకుండా, సహజంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మొండి చుండ్రును ఎలా వదిలించుకోవచ్చో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి. ఆరోగ్యవంతమైన మరియు ఒత్తయిన జుట్టు కోసం బెస్ట్ టిప్స్.

చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే ఒక పట్టానా వదలదు. చుండ్రు సమస్య రాగానే మనలో చాలా మంది ఖరీదైన నూనెలు,షాంపూలు వాడుతూ ఉంటారు. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.

చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. వేప ఆకులు చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వేపాకులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. వేపాకును గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

కొన్ని వేపాకులను నీటిలో వేసి నీరు ఆకుపచ్చ రంగు అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారనివ్వాలి. ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది.

వేప ఆకులను పేస్ట్ గా చేసి జుట్టుకి బాగా పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. కొద్దిగా కొబ్బరినూనెలో పది వేపాకులను వేసి నూనెను బాగా వేడిచేయాలి. ఈ విధంగా వేడి చేసిన నూనెను చల్లబరచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ వేపనూనెను వారానికి రెండు సార్లు రాసి… ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. వేపలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను మరియు చుండ్రుకి కారణం అయినా కారకాలను నిర్మూలించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."