Healthhealth tips in telugu

ఈ సీజన్‌లో కచ్చితంగా తినాల్సిన పండు ఇదే.. ఎందుకో తెలుసా?

Rose Apple Benefits in Telugu :రోగనిరోధక శక్తిని పెంచి, ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే ఈ అద్భుతమైన సీజనల్ పండు గురించి మీకు తెలుసా? దీనిలో ఉన్న రహస్య ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దీన్ని ఎందుకు మిస్ అవ్వకూడదో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకోండి.

నేరేడు కుటుంబానికి చెందిన రకమే రోజ్ యాపిల్ (Rose Apple). దీని శాస్త్రీయ నామం సిజీజియం జ్మబొస్. ఈ వృక్షం కాసే రోజ్ యాపిల్ పళ్ళు తినడానికి నాటు గులాబీ రేఖల రుచి కలిగి ఉంటుంది. ఈ రకం ఎక్కువగా ఆగ్నేయపు ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. భారత దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కనిపిస్తుంది.
rose apple
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలలోను కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తున్నది.తీపి మరియు సువాసనగల గుండ్రని ఆకారపు పండ్లను ఉత్పత్తి చేస్తుంది. రోజ్ యాపిల్ లో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్,విటమిన్-ఎ,థయామిన్ (B1 ),రైబోఫ్లావిన్ (B2 ), నియాసిన్ (B3 ,కాల్షియం,ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్,ఫాస్ఫరస్,పొటాషియం,సోడియం,జింక్ సమృద్దిగా ఉంటాయి.

రోజ్ ఆపిల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక రకాల బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ పండ్లలో అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఇది గుండెకు సంబందించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.దీనిలో నియాసిన్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

జీవక్రియను పెంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఈ పండు సహాయపడుతుంది. దాంతో డయబెటిస్ ఉన్నవారిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోజ్ ఆపిల్ మూత్రపిండాల పనితీరుకు సహాయపడే మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. కిడ్నీ సమస్యలు లేకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

జ్వరం,తలనొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుందని “ఇంటర్నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ” లో ప్రచురించబడిన అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. తలనొప్పిని తగ్గించే సామర్ధ్యం కూడా కలిగి ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."