మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’కి పోటీగా వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టిన సినిమాలు ఇవే!
Mahesh babu Brahmotsavam Movie Details : సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలతో నటించిన సినిమా ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని మిగిల్చింది. అయితే, సరిగ్గా ఇదే సమయానికి బ్రహ్మోత్సవం సినిమాకి పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగిన కొన్ని సినిమాలు మాత్రం ఊహించని రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఆ సినిమాలు ఏంటి? అప్పట్లో బాక్సాఫీస్ వద్ద జరిగిన ఆ ఆసక్తికరమైన క్లాష్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో బ్రహ్మోత్సవం మూవీని మహేష్ చేసాడు.
అయితే కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, సత్యరాజ్ ఇలా భారీ తారాగణంతో భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఘోరంగా డిజాస్టర్ అయింది. 2016మే 20న రిలీజైన ఈ మూవీకి వారం రోజుల ముందు అంటే మే 13న వచ్చిన బిచ్చగాడు మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇచ్చిన థియేటర్స్ కి అదనంగా మరికొన్ని థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేసారు.
విజయ్ అంథోని నటించిన ఈ మూవీ తమిళ్ నుంచి డబ్బింగ్ అయినప్పటికీ ఏమాత్రం అంచనాలు లేకున్నా భారీ అంచనాలను దాటింది. బిచ్చగాడుతోనే పెన్సిల్ మూవీ రిలీజయింది. జివి ప్రకాష్, శ్రీవిద్య నటించిన ఈ మూవీ నిరాశ పరిచింది. హర్రర్ మూవీగా వచ్చిన స్ట్రాబెర్రి మూవీ కూడా అలరించలేకపోయింది. మే 6న సూర్య మూడు విభిన్న పాత్రలలో నటించిన 24మూవీ రిలీజయింది.
సమంత హీరోయిన్ గా చేసిన ఈ మూవీని విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. ఈ మూవీ సక్సెస్ ని అందుకుంది. మే 5న సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సుప్రీం మూవీ కూడా బాగానే ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవానికి వారం తర్వాత మే 27న తమిళ స్టార్ విశాల్ హీరోగా రాయుడు మూవీ రిలీజయింది. ఫైట్స్ అన్నీ బాగున్నా సినిమా డిజాస్టర్ అయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నితిన్, సమంత జంటగా జూన్ 2న అ ఆ మూవీ రిలీజయింది. నదియా కీలక పాత్ర చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుని సూపర్ హిట్ అయింది. జూన్ 3న సూపర్ స్టార్ కృష్ణ నటించిన శ్రీ శ్రీ రిలీజై నిరాశ పరిచింది. అదేరోజు వచ్చిన అడవిలో లాస్ట్ బస్, శ్రీమతి బంగారం మూవీస్ నిరాశ పరిచాయి.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

