Healthhealth tips in telugu

వారానికి 2 సార్లు ఇది తింటే చాలు.. కళ్లద్దాలు తీసేయొచ్చు, కంటి నరాలకు తిరుగులేదు!

Palak Khandvi : పెరిగిన స్క్రీన్ టైమ్ వల్ల చిన్న వయసులోనే కళ్ళు అలసిపోతున్నాయా? అయితే మీ డైట్‌లో చిన్న మార్పు చేసి చూడండి. వారంలో కేవలం రెండు రోజులు ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటే చాలు, మీ కంటి నరాలు ఉక్కులా మారడమే కాకుండా చూపు మరింత స్పష్టంగా మారుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆ అద్భుతమైన ఫుడ్ ఏంటి? దాన్ని ఎలా తినాలో ఇక్కడ చదివేయండి.

కంటికి సంబందించిన సమస్యలు లేకుండా కంటి చూపు బాగుండేలా ఉండటానికి ఇప్పుడు చెప్పే Palak Khandvi చాలా బాగా సహాయపడుతుంది . కంటికి ఎటువంటి సమస్యలు ఉండవు. దీనిని వారంలో రెండు సార్లు చేసుకొని తింటే మంచిది. Calcium సమృద్దిగా ఉండుట వలన ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో కట్ చేసిన కప్పున్నర పాలకూర,కరివేపాకు, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు,ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమంలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల మల్టీ గ్రైన్ పిండి వేసి మరొక సారి మిక్సీ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి పైన వచ్చిన పిప్పిని తీసేయాలి. పాలక్ పేస్ట్ లో 5 ఎండుమిరప ముక్కలు,కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. బాగా ఉడికాక ముక్కలుగా కట్ చేసి రోల్స్ కింద చుట్టాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి మీగడ వేసి కొంచెం వేడి అయ్యాక 1 స్పూన ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర,1 స్పూన్ వెగించిన నువ్వులు వేసి బాగా వేగించాలి. వేగిన ఈ మిశ్రమాన్ని పైన తయారుచేసుకున్న రోల్స్ పైన వేయాలి. ఈ విధంగా తయారుచేసుకొని తింటే మంచి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."