Healthhealth tips in telugu

పంటి నొప్పి, చిగుళ్ల వాపు, పిప్పి పన్నుకు శాశ్వత చెక్.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!

Tooth infections : పంటి నొప్పి, చిగుళ్ల వాపు, మరియు పిప్పి పన్నుతో బాధపడుతున్నారా? మందులు లేకుండా, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ నోటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా పొందవచ్చో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకోండి.

మనలో చాలా మంది ఎన్నో రకాల దంతాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఓక రకంగా చెప్పాలంటే నూటికి 80 శాతం మంది పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పంటి ఇన్ ఫెక్షన్,పిప్పి పన్ను వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే పంటి మీద ఏనామిల్ దెబ్బతిని సెన్సిటివ్ గా మారిపోవడం కూడా జరుగుతుంది.

ఈ సమస్యలను తగ్గించటానికి కరక్కాయ చాలా బాగా సహాయపడుతుంది. కరక్కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కరక్కాయలో అరబింనో గెలాక్టిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండుట వలన నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. మార్కెట్లో కరక్కాయలు విరివిగానే లభ్యం అవుతాయి. అలాగే కరక్కాయ పొడి కూడా దొరుకుతుంది.

కరక్కాయ పొడితో నోట్లో వేలు తోనే లేదా బ్రష్ తో కాని పళ్ళపొడితో బ్రష్ చేసుకున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. లేదా కరక్కాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ తో పళ్లను తోముకుంటే పంటికి సంబందించిన సమస్యలు ఉండవు. పూర్వ కాలంలో దంత సమస్యలకు ఎక్కువగా కరక్కాయను ఉపయోగించేవారు.

కరక్కాయ పొడి లేదా పేస్ట్ తో దంతాలను తోముకోవటం వలన పంటి నొప్పి,చిగుళ్ళ వాపు,పిప్పి పన్ను,పంటి ఇన్ ఫెక్షన్, నోటిలో బ్యాక్టీరియా తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన కూడా ఉండదు. కాబట్టి కరక్కాయను ఉపయోగించి పంటి సమస్యల నుండి సులభంగా బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."