Healthhealth tips in telugu

కరివేపాకును కూరలోంచి తీసి పారేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే ఇకపై అస్సలు వదిలిపెట్టరు!

Curry Leaves Health Benefits : మనం తినే ఏ కూర చూసినా అందులో కరివేపాకు కచ్చితంగా ఉంటుంది. కానీ, భోజనం చేసేటప్పుడు మనలో 90 శాతం మంది చేసే మొదటి పని.. ఆ కరివేపాకును తీసి పళ్ళెం పక్కన పెట్టేయడమే! కేవలం రుచి, సువాసన కోసమే దీన్ని వాడుతున్నారని మీరు అనుకుంటే పొరపాటే.

ఆ చిన్న ఆకుల్లో ఉన్న విటమిన్ ఎ, బి, సి మరియు అమైనో ఆమ్లాలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అసలు రోజూ కరివేపాకు తింటే శరీరంలో ఏం జరుగుతుంది? జుట్టు, చర్మం, కంటి చూపుకు ఇది ఎలా మేలు చేస్తుందో తెలిస్తే.. ఇకపై మీరు కరివేపాకును అస్సలు పారేయరు. అవేంటో ఇప్పుడే చదివి తెలుసుకోండి.

క‌రివేపాకు తెలియ‌ని వారుండ‌రు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధ పరమైన ఉపయోగాలున్నాయి. దీన్ని పూర‌త‌న కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. నిజానికి క‌రివేపాకు మ‌న‌కు విరివిరిగా దొరుకుతుంది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండిస్తారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతే కాదు కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి.
curry leaves
అయితే చాలా మందికి క‌రివేపాకు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.కూర‌లో క‌రివేపాకును తీసి ప‌క్క‌న పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని తినడం వల్ల మాత్రం చాలానే లాభాలు ఉన్నాయి. క‌రివేపాకుతో ఆరోగ్యాన్ని..అందాన్ని కూడా పెంపొందించుకోవ‌చ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..క‌రివేపాకు ప్ర‌తిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి క‌లిగిస్తుంది.

వికారం, వాంతులు, డయేరియాను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. క‌రివేపాకు అధిక కొల‌స్ట్రాల్ త‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప్ర‌తి రోజు త‌మ ఆహారంలో క‌రివేపాకు తీసుకోవ‌డం చాలా మంచిది. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. క్రమంగా జుట్టు పెరుగుతుంది.

అలాగే కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోవ‌డం త‌గ్గుతుంది.క‌రివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటాయి. దీన్ని ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌ను దూరంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌కు క‌రివేపాకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.రక్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గించే శ‌క్తి క‌రివేపాకు ఉండ‌డంతో దీన్ని రోజు తిన‌డం చాలా మంచిది.

కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు ద‌రిచేర‌కుండా ఉప‌యోగ‌ప‌డుతుంది. కంటికి క‌రివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. క‌ర‌వేపాకులో ఉండే విట‌మిన్ ఎ కంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డానికి బాగా స‌హ‌క‌రిస్తుంది..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."