రోజుకో లడ్డు తింటే చాలు… నీరసం, అలసట, నరాల బలహీనత మాయం!
Powerful Laddu to Reduce Nerves Weakness : సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల నేడు చాలామంది చిన్న వయసులోనే నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట బారిన పడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టే అద్భుతమైన పరిష్కారం ఈ ‘ప్రోటీన్ లడ్డు’.
ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎంతో సులభంగా తయారుచేసుకోగలిగే ఈ లడ్డును రోజుకొకటి తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఎముకలు, నరాలు దృఢంగా మారి నీరసం దరిచేరదు. ఈ శక్తివంతమైన లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!
నరాల బలహీనత లేకుండా కండరాలు బలంగా ఉండటానికి మరియు శరీరానికి ప్రోటీన్ సమృద్దిగా అందటానికి ఒక లడ్డు తయారుచేసుకుందాం. ఈ లడ్డులో బెల్లం ఉపయోగించటం లేదు. ఒక పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి 100 గ్రాముల ఎండు ద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత 100 గ్రాముల ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో వేసి జిగురు వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత 100 గ్రాముల నల్ల మినపప్పును వెగించి పొడి చేసుకొని ఒక బౌల్ లో వేయాలి. ఆ తర్వాత 50 గ్రాముల తవుడు, 50 గ్రాముల వేగించిన కొబ్బరి తురుము వేయాలి.
ఆ తర్వాత ఎండు ద్రాక్ష,ఖర్జూరం, వేగించిన బాదం,జీడిపప్పు ముక్కలు. పావు స్పూన్ యాలకుల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే అధిక మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్ మన శరీరానికి అందుతాయి. ఈ లడ్డు కండరాల నిర్మాణానికి మరియు హార్మోన్ ఉత్పత్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
దీనిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలకు మరియు ప్రేగులను శుభ్రపరచడానికి మంచిది. ఈ లడ్డు తయారీకి తీసుకున్న తవుడులో అధిక మొత్తంలో B-కాంప్లెక్స్, రిబోఫ్లావిన్, B1, B2, B3, B6 ఉంటాయి. నరాలలో బలం, శక్తి విడుదల మరియు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ లడ్డు పోషకాహార లోపం లేకుండా చేస్తుంది.
పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉండుట వలన మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందించి అల్జీమర్స్ మరియు మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. ఇది జీర్ణక్రియ మరియు కాలేయ నిర్విషీకరణను మెరుగుపరుస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు రోజుకి ఒక లడ్డు తినవచ్చు. అలసట,నీరసం,నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
Protein laddu recipe in Telugu, Healthy energy laddu, నరాల బలహీనతకు ఇంటి చిట్కాలు, Natural remedies for weakness, Telugu health and food tips, Immunity boosting foods.

