Healthhealth tips in telugu

రోజుకు 1 స్పూన్ ఇలా తీసుకోండి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మాయం, రక్తనాళాలు క్లీన్!

A natural remedy for cleansing blood vessels : మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే రక్తనాళాల్లో (Blood vessels) పేరుకుపోయిన కొవ్వును కరిగించి, ఎలాంటి బ్లాకేజ్ లేకుండా చేసే ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ మన వంటగదిలోనే ఉంది.

రోజూ ఒక స్పూన్ వాడకంతో నరాలను శుభ్రం చేసి, గుండెను కాపాడే ఆ దివ్యౌషధం తయారీ విధానం, దాని ప్రయోజనాలు ఏంటో ఈ పోస్ట్‌లో చదివి వివరంగా తెలుసుకోండి.

రక్త నాళాలను శుభ్రం చేయటానికి ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఒక స్పూన్ తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లను తొలగించి రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. varicose veins ఉన్నవారిలో రక్తప్రసరణ బాగా జరగటానికి సహాయపడుతుంది. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

అవి వెల్లుల్లి,నిమ్మకాయ. ఈ రెండు కూడా మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. మూడు నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాల ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మరసం ఫలకం కారణంగా తరచుగా దెబ్బతినే రక్త నాళాల గోడలను బలపరుస్తుంది.

ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లితో నిమ్మకాయ కలిసినప్పుడు రెట్టింపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. స్ట్రోక్ మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 50 గ్రాముల వెల్లుల్లిని తీసుకొని పై తొక్క తీసేయాలి. వెల్లుల్లిలో సహజ యాంటీబయాటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంలోని అన్ని వాపులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్తాన్ని శుభ్రపరచటమే కాకుండా సిరలు మరియు ధమనులకు స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది.గుండె మరియు హృదయ నాళ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ, వెల్లుల్లి రక్తం పలుచగా ఉండేలా చేయటమే కాకుండా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

చిక్కగా ఉన్న రక్తాన్ని పలుచగా చేస్తుంది. నిమ్మకాయ ముక్కలు,వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి సీసాలో నిల్వ చేయాలి. ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."