Healthhealth tips in telugu

నరాల బలహీనత, మతిమరుపు ఇక సెలవు.. నాడీ వ్యవస్థను బలోపేతం చేసే అద్భుత చిట్కా!

Best Foods for Your Nervous System : వయసు పెరుగుతున్న కొద్దీ నరాల బలహీనత, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు రావడం చాలామందిలో చూస్తుంటాం. అయితే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో నాడీ వ్యవస్థ (Nervous System) పనితీరును అద్భుతంగా మెరుగుపరచవచ్చు.

మెదడును యాక్టివ్‌గా ఉంచి, నరాలకు అమితమైన బలాన్నిచ్చే ఆ బెస్ట్ డైట్ / చిట్కా గురించి, దాన్ని వాడే విధానం గురించి ఇక్కడ వివరంగా చదవండి.నరాల బలహీనత లేకుండా నాడీ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం.

మన శరీరం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేయలేవు. దెబ్బతిన్న నరాలను సరిచేయడానికి మరియు నరాలవ్యాధి చికిత్సకు చాలా బాగా సహాయపడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చేపలలో ఎక్కువగా ఉంటుంది. చేపలను తినని వారు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

అరటిపండు కూడా నరాల బలహీనత లేకుండా నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. అరటిపండులో విటమిన్ B6 సమృద్దిగా ఉండుట వలన న్యూరోట్రాన్స్మిటర్లు అన్ని అవయవాలకు సంకేతాలను పంపడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే మంచిది. అరటిపండ్లు అన్నీ కాలాల్లోనూ లభ్యం అవుతాయి.

చియా గింజలలో కొన్ని అద్భుతమైన ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ గింజలలో కాల్షియం కూడా సమృద్దిగా ఉంటుంది. మనలో చాలా మంది కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. కానీ నాడీ వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుంది. కాల్షియం మెదడు కణాల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

శరీరంలోని ఇతర భాగాలకు కమ్యూనికేషన్ కోసం మార్గాలను రూపొందించడంలో సహాయపడుతుంది. కాల్షియం నరాల కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. .

అంతేకాకుండా అవి దెబ్బతిన్న తర్వాత వాటిని తిరిగి నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు పావు స్పూన్ చియా గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది.

ఎరుపు, నీలం రంగులో ఉండే బెర్రీలలో ఆంథోసైనిన్లు అనే ఫ్లేవనాయిడ్ ఉండుట వలన డయాబెటిక్ న్యూరోపతి అలాగే నాడీ వ్యవస్థకు బాగా హెల్ప్ చేస్తుంది.

వృద్ధాప్యం నుండి మెదడు కణాలను కాపాడుతుంది. మెదడులో రక్తప్రవాహానికి అడ్డం లేకుండా చేస్తుంది. న్యూరాన్‌లను దెబ్బతీసే వాపును తగ్గించి అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను తీసుకుంటే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."