Healthhealth tips in telugu

రోజుకు 1 గ్లాస్ తాగితే చాలు.. రక్తహీనత, నీరసం, అలసట మాయం!

Anemia Best Drink : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య రక్తహీనత (Anemia). శరీరంలో తగినంత రక్తం మరియు ఐరన్ లేకపోవడం వల్ల ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం, ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా అనిపించడం జరుగుతుంది.

అయితే, ఈ సమస్యలను అధిగమించడానికి రోజూ ఖరీదైన మందులు, టానిక్‌లు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈ ఒక్క గ్లాస్ డ్రింక్ రోజూ తాగితే చాలు.. మీ శరీరంలో రక్తం వేగంగా వృద్ధి చెందుతుంది.

అలసట, నీరసం పూర్తిగా మాయమై రోజంతా ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. ఇంతకీ ఆ అద్భుతమైన న్యాచురల్ డ్రింక్ ఏమిటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా రక్తహీనత (Anemia) సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. రక్తహీనత సమస్యను అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డ్రింక్ తీసుకోవటం వలన నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి ఏమీ లేకుండా హుషారుగా ఉంటారు. ఒక బౌల్ లో ఒక స్పూను సన్ ఫ్లవర్ గింజలు, ఒక స్పూను పుచ్చ గింజలు, ఒక స్పూను గుమ్మడి గింజలు, నాలుగు బాదం పప్పులు, రెండు డ్రై అంజీర్ వేయాలి.

ఆ తర్వాత 2 వాల్ నట్స్, నాలుగు గింజలు తీసిన ఖర్జూరాలు, నాలుగు ఎండు ద్రాక్షలు, ఒక స్పూన్ చియా సీడ్స్, అర స్పూన్ అవిసె గింజలు వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన వీటిని మిక్సీ జార్ లో నీటితో సహా వేసి మిక్సీ చేయాలి. బాదం పప్పు తొక్క తీసి వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు, రెండు స్పూన్ల తేనె వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాస్ లో పోస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన డ్రింక్ సిద్ధం అయినట్టే.

ఈ డ్రింక్ ని ప్రతి రోజు 15 రోజుల పాటు తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి ఏమి ఉండవు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాస్త శ్రద్ద,ఓపికగా ఇలా ఇంటిలో తయారుచేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య నుండి బయట పడవచ్చు.

ఈ డ్రింక్ లో తీసుకున్న అన్నీ రకాల డ్రై ఫ్రూట్స్ Online Stores లేదా డ్రై ఫ్రూట్స్ షాప్ లలో విరివిగానే లభ్యం అవుతున్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించి డ్రింక్ తయారుచేసుకొని తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ డ్రింక్ ని చిన్న పిల్లలకు ప్రతి రోజు ఇస్తే చాలా హుషారుగా ఉంటారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."