Healthhealth tips in telugu

కేవలం పది రూపాయలకే దొరికే ఈ ఆకుకూర.. కంటిచూపుకు, కీళ్ల నొప్పులకు మహాద్భుతమైన ఔషధం!

ponnaganti kura Benefits In Telugu : ప్రస్తుత కాలంలో కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. గంటల తరబడి ఫోన్లు, లాప్‌టాప్‌లు చూడటం వల్ల కంటి చూపు మందగించడం, అలాగే సరైన పోషకాహారం మరియు శారీరక శ్రమ లేక కీళ్ల నొప్పుల బారిన పడటం సర్వసాధారణం అయిపోయింది.

వీటి నుంచి బయటపడేందుకు వేలకు వేలు ఖర్చు చేసి మందులు వాడుతూ విసిగిపోయారా? అయితే మనకు మార్కెట్లో అతి చవకగా దొరికే ఒక అద్భుతమైన ఆకుకూర గురించి మీరు తెలుసుకోవాల్సిందే. విటమిన్లు, క్యాల్షియం, మరియు మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ ఆకుకూరను మన డైట్‌లో చేర్చుకుంటే కంటి చూపు అద్భుతంగా మెరుగుపడటమే కాకుండా, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి.

ఇంతకీ అమృతం లాంటి ఆ ఆకుకూర ఏమిటి? దాని వల్ల కలిగే ఇతర అద్భుత ప్రయోజనాలు ఏమిటి? దాన్ని ఎలా వండుకుని తినాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పొన్నగంటి ఆకులతో పప్పు, కూర చేసుకుంటూ ఉంటాం. ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా వాడతారు. పొన్నగంటి కూరలో విటమిన్‌ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటిచూపు మెరుగుదలకు సహాయ. పడుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
ponnaganti kura
ఎక్కువసేపు కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల కళ్లను రక్షించుకోవచ్చు. కంటి చూపు రెట్టింపవుతుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. వారు కూడా వారంలో రెండు సార్లు ఈ కూరను తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. సంవత్సరం పొడవునా ఈ ఆకుకూర విరివిగానే లభ్యం అవుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.

ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ కూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణ సంబంద సమస్యలు తగ్గుతాయి.

పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉండే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."