వరుణ్ తేజ్ కంటే ముందు ‘ఫిదా’ స్టోరీ విన్నది ఆ స్టార్ హీరోనే.. తెలిస్తే షాక్ అవుతారు!
Varun tej Fidaa Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భానుమతి పాత్రలో సాయి పల్లవి యాక్టింగ్, ఎన్నారై కుర్రాడిగా వరుణ్ తేజ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అయితే, మీకు తెలియని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయిస్ వరుణ్ తేజ్ కాదట!
ఈ కథను రాసుకున్నప్పుడు ఆయన మదిలో ఉన్నది టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్ర హీరో. ఆయనకు కథ వినిపించడం, కొన్ని కారణాల వల్ల ఆ హీరో ఈ ప్రాజెక్టును సున్నితంగా తిరస్కరించడం జరిగాయట.

ఆ తర్వాతే ఈ కథ మెగా కాంపౌండ్‌లోకి వెళ్లి వరుణ్ తేజ్ చేతికి వచ్చింది. ఇంతకీ శేఖర్ కమ్ముల ముందుగా అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన ఈ బ్లాక్‌బస్టర్ కథను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం!
మెగా హీరో వరుణ్ తేజ్ ,సాయి పల్లవి నటించిన ఫిదా విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే .శేఖర్ ఖమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి .ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంది .
సాయి పల్లవిది కేరళ అయ్యినప్పటికి తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది .ఫిదా సినిమా హిట్ కావడంతో తెలుగు లో ఆమెకు వరుస అవకాశాలు క్యు కట్టాయి .వరుణ్ తేజ్ కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గ నిలిచింది ఆ చిత్రం. అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తి విషయాలు బయటకు వచ్చాయి .ఫిదా’ సినిమాలో మొదటగా మహేష్ బాబును హీరో గా అనుకున్నారట.
మహేష్ కి కొన్ని కారణాల కారణంగా కుదరలేదు. అప్పుడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సలహా మేరకు ఆ అవకాశం వరుణ్ తేజ్ కి వచ్చింది అంట .కాగా ఈ సినిమా టీమ్ సాయి పల్లవి కోసం ఆరు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది అంట .ఆమె డాక్టర్ కోర్స్ పూర్తి అయిన తరువాత వచ్చి ఈ సినిమా చేసింది అంట .తక్కువ ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లను మాత్రం గట్టిగ రాబట్టింది .
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

