Healthhealth tips in telugu

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు! ఎందుకంటే?

Garlic Side Effects In telugu : మన భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి ఇంటి వంటగదిలో వెల్లుల్లి కచ్చితంగా ఉండాల్సిందే. కేవలం రుచి కోసమే కాకుండా, ఎన్నో ఏళ్లుగా మన పెద్దలు దీనిని ఒక అద్భుతమైన ఇంటి వైద్యంగా ఉపయోగిస్తున్నారు.

రోజూ పరగడుపున వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారని, కొలెస్ట్రాల్ కరుగుతుందని చాలామంది సోషల్ మీడియాలో చూసి గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. అయితే, అన్నీ అందరికీ సరిపడవు అన్న చిన్న లాజిక్ మనం మర్చిపోకూడదు. వెల్లుల్లిలో వేలకొద్దీ ఔషధ గుణాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్లు, లివర్ సమస్యలు ఉన్నవారు, అలాగే గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కూడా రోజూ వెల్లుల్లి తినే అలవాటు ఉంటే, ముందుగా మీ శరీర తత్వానికి అది సరిపడుతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి? మోతాదుకు మించి తింటే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి? ఈ విషయాలన్నీ ఎలాంటి సందేహాలు లేకుండా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.

వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది వెల్లుల్లి వాసన కారణంగా తినరు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా తినటానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
garlic
వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉండుట వలన వెల్లుల్లి శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుందని మరియు హెపటైటిస్ సమస్యను తగ్గిస్తుందని అందరూ భావిస్తారు.

కానీ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కడుపు మరియు ప్రేగులలోని గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గుతుంది. శరీరంలోని జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. వికారం మరియు వాంతులు కలిగిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్న వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారిలో ఆ సమస్యను తీవ్రతరం చేస్తుంది.

ఏదైనా శస్త్రచికిత్స అవసరం అయినప్పుడు రెండు వారాల ముందు వెల్లుల్లిని తీసుకోవడం మానేయాలి. వెల్లుల్లిపాయలు తినే సమయంలో సర్జరీ చేస్తే రక్తస్రావం పెరిగి రక్తం గడ్డకట్టడం సాధ్యం కాదని నిపుణులు చెప్పుతున్నారు. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నప్పుడు మందులు వాడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కంటి సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే కంటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. దీంతో కంటి చూపు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."