Healthhealth tips in telugu

ఉదయాన్నే ఈ రసం తాగితే.. మీ షుగర్ లెవెల్స్ ఇక మీ కంట్రోల్‌లోనే!

How to control diabetes naturally : మధుమేహం (డయాబెటిస్) తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా షుగర్ కంట్రోల్ కావడం లేదా? అయితే మీ రోజువారీ డైట్‌లో ఈ అద్భుతమైన రసాన్ని చేర్చుకోండి.

ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగా తగ్గించడమే కాకుండా, మళ్లీ అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ హెల్తీ జ్యూస్ ఏంటి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.

డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ ఉన్న వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Diabetes In Telugu
డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ కొన్ని మూలికలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడతాయి. కొంత జీవనశైలి అలవాట్లను కూడా మార్చుకోవాలి. ప్రతి రోజు తప్పనిసరిగా అరగంట వ్యాయామం చేయాలి. ఇప్పుడు చెప్పే రసాలలో ఏదో ఒక దానిని తీసుకుంటే సరిపోతుంది.

ఈ మధ్యకాలంలో తిప్పతీగ చాలా ప్రాచుర్యం పొందింది. డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. తిప్పతీగ రసాన్ని ప్రతి రోజు ఉదయం తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మునగ ఆకులలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అలాగే మునగ ఆకులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. మునగ ఆకుతో పొడి తయారుచేసుకొని తీసుకోవచ్చు..లేదంటే మునగ ఆకుతో టీ తయారుచేసుకొని తాగవచ్చు.

వేప ఆకులలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెప్పుతున్నారు. వేప ఆకు డయాబెటిస్ ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో…అనే దాని మీద చాలా పరిశోదనలు చేశారు. వేప ఆకు రసం లేదా వేప ఆకు నమిలి తినడం వల్ల డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఇప్పుడు చెప్పిన తిప్పతీగ, మునగ,వేప…ఈ మూడు కూడా డయాబెటిస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీకు లభ్యం అయినా దాన్ని బట్టి ఈ మూడింటిలో ఒక్క దాన్ని ప్రతి రోజు తీసుకుంటే సరిపోతుంది. వేప ఆకు, తిప్పతీగ, మునగ ఆకు ఈ మూడు కూడా చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."