Healthhealth tips in telugu

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా.. కేవలం 5 నిమిషాల్లోనే ఉపశమనం.

Headache Home Remedies : విపరీతమైన తలనొప్పి వస్తే ప్రాణం పోయినట్లు అనిపిస్తుందా? మైగ్రేన్ నొప్పితో ఏ పనీ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం 5 నిమిషాల్లో ఎంతటి భయంకరమైన తలనొప్పినైనా ఇట్టే తగ్గించే ఒక మ్యాజిక్ ట్రిక్ మన వంటగదిలోనే ఉంది. అదేంటో, దాన్ని ఎలా ఫాలో అవ్వాలో వెంటనే చదివేయండి.

తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. మనలో చాలామంది తలనొప్పి రాగానే షాప్ కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నార్మల్ తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పి అయినా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

పుదీనా టీ తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. తాజా పుదీనా ఆకులను నమిలి మింగవచ్చు…లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 పుదీనా ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి.

అల్లం టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు తయారుచేసుకొనే టీలో అల్లం వేసుకుంటే సరిపోతుంది. అల్లంలో నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పిని తగ్గిస్తుంది. టీలో అల్లం వేసుకొని తాగటం కుదరని వారు…పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలుపుకొని తాగవచ్చు.

దాల్చిన చెక్క టీ కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నొప్పులను తగ్గిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

ఇప్పుడు చెప్పిన మూడు రకాల టీలు తలనొప్పి అలాగే మైగ్రైన్ తలనొప్పి వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. వీటిలో ఉన్న లక్షణాలు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి. ఈ టీలను తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ మూడింటిలో మీకు లభ్యం అయినా దాన్ని బట్టి ఒక రకం టీని తాగితే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."