Healthhealth tips in telugu

రోజూ రాగులు తింటే నిజంగానే బరువు తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది?

Is ragi good for weight loss : అధిక బరువుతో బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదా? అయితే మీ రోజువారీ ఆహారంలో రాగులను (Finger Millet) చేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. రాగులలో ఉండే అధిక ఫైబర్, క్యాల్షియం మరియు ఇతర పోషకాలు మీ బరువును సహజంగా ఎలా నియంత్రిస్తాయో, ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఈ బ్లాగ్‌లో పూర్తి వివరంగా తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది సాదరణ సమస్యగా మారిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే రాగులను తీసుకొని బరువు ఎలా తగ్గవచ్చో చూద్దాం.
Weight Loss tips in telugu
బరువు తగ్గటానికి రాగులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. బరువు తగ్గటంలో తీసుకొనే ఆహారం మరియు వ్యాయామం రెండూ కీలకమైన పాత్రను పోషిస్తాయి. బరువు తగ్గించే ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. రాగులలో ప్రోటీన్,కార్బోహైడ్రేడ్స్ ,ఫైబర్,పొటాషియం,కొన్ని రకాల అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.

రాగులలో ఉండే అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్‌ అనేది ఆకలిని నియంత్రిస్తుంది. తక్కువ క్యాలరీలు మరియు కొవ్వు కలిగి ఉండి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. రాగులలో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే జీర్ణక్రియ ప్రక్రియకు ఎక్కువగా శక్తిని ఉపయోగిస్తుంది.

ఆ విధంగా ఇది బరువు తగ్గడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. బరువు తగ్గడానికి కేలరీలను కోల్పోవడం అవసరం. రాగి జీర్ణక్రియకు తోడ్పడే మిల్లెట్ కావడం వల్ల బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయం చేస్తుంది. రాగులలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కొవ్వు అణువులను ఆక్సీకరణం చేయడంలో సహాయపడుతుంది.

దాంతో కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. రాత్రి నిద్ర బాగా పట్టటానికి కూడా రాగులు సహాయపడతాయి. సరైన నిద్ర లేకపోయిన బరువు పెరిగే అవకాశం ఉంది. రాగులు బరువు తగ్గించటానికి సహాయపడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి రాగులను ఆహారంలో బాగంగా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."