మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ వెనుక ఉన్న ఈ అసలు కథ మీకు తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక తెలుగు తెరకు కౌబాయ్ (Cowboy) సినిమాలను పరిచయం చేసిన ఘనత కృష్ణగారిదే.
అప్పట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత, కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ కౌబాయ్ మూవీ చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
10 కోట్ల బడ్జెట్.. వెనక్కి తగ్గిన నిర్మాత
‘టక్కరి దొంగ’ చిత్రానికి జయంత్ సి పరాంజీ దర్శకుడు. అయితే ముందుగా ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు నిర్మించాల్సి ఉంది. కానీ అప్పటికి మహేష్ బాబుకు రెండు హిట్లు మాత్రమే ఉండటం, ఇది అతనికి కేవలం ఐదో సినిమా కావడంతో 10 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేందుకు కె.ఎస్. రామారావు వెనకడుగు వేశారు. అప్పుడు ఆయన అనుమతితో దర్శకుడు జయంత్ స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమాను పట్టాలెక్కించారు. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డూప్ వద్దు అన్నందుకు డైరెక్టర్ తో గొడవ..
ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా ఏడాది పాటు డేట్స్ ఇచ్చాడు. బాలీవుడ్ హీరోయిన్లు నటించిన ఈ సినిమాను ఎక్కువ భాగం అమెరికాలో భారీ ఖర్చుతో చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో డైరెక్టర్ కు, మహేష్ బాబుకు మధ్య మూడు సార్లు వాగ్వాదం జరిగిందట. దానికి కారణం మహేష్ బాబు డెడికేషన్ మరియు రిస్క్ చేయడమే.
రైలు దగ్గర తీసే యాక్షన్ ఎపిసోడ్, బ్రిడ్జి పై జరిగే ఫైట్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే రోప్ వే సీన్స్.. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. అందుకే వీటికి డూప్ (బాడీ డబుల్) ని పెడతామని డైరెక్టర్ చెప్పినా మహేష్ వినలేదు.
ఆ మూడు రిస్క్ షాట్స్ ను డూప్ లేకుండా మహేష్ స్వయంగా చేయడంతోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ప్రమాదకరమైన స్టంట్స్ గురించి తెలుసుకున్న కృష్ణ గారు కూడా అప్పట్లో చాలా కంగారు పడ్డారట.
ఒకే ఫ్యామిలీ.. రెండు జనరేషన్స్..
కథ, కథనాల్లో సరైన బలం లేకపోవడం వల్ల ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. కానీ, ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు జనరేషన్ల హీరోలు కౌబాయ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించడం మాత్రం ఒక్క కృష్ణ, మహేష్ బాబులకే దక్కిన అరుదైన రికార్డు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

