Beauty TipsHealthhealth tips in telugu

ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇంట్లోనే సులభంగా దొరికే వీటితో మొండి చుండ్రుకు చెక్ పెట్టండి.

Dandruff: నలుగురిలోకి వెళ్లినప్పుడు డార్క్ కలర్ బట్టలు వేసుకోవాలంటే భయంగా ఉందా? భుజాలపై రాలే చుండ్రు, తలలో విపరీతమైన దురద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మార్కెట్లో దొరికే ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వాడినన్ని రోజులు బాగానే ఉండి, మానేయగానే మళ్లీ చుండ్రు వస్తుంటే.. ఈ ఆర్టికల్ మీకోసమే!

చుండ్రు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, పొడి చర్మం లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యే అయినా.. దాన్ని నిర్లక్ష్యం చేస్తే జుట్టు కుదుళ్లు బలహీనపడి తీవ్రమైన హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. అయితే ఎలాంటి కెమికల్స్ వాడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు.

జుట్టు కుదుళ్లను శుభ్రం చేసి, చుండ్రును తరిమికొట్టే ఆ అద్భుతమైన ఇంటి చిట్కాలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? మళ్లీ చుండ్రు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ బ్లాగ్ లో వివరంగా తెలుసుకుందాం. చదివేసి వెంటనే ట్రై చేయండి!

చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు ఒకసారి వచ్చిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం. మనలో చాలా మంది చుండ్రు రాగానే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు వెళ్తూ ఉంటారు. మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

బాగా వేడిగా ఉన్న నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు, తలపై తేమ తగ్గిపోవడం వంటి కారణాలతో చుండ్రు సమస్య వస్తుంది. కొంతమందిలో చుండ్రు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే చుండ్రు సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ మెంతిపొడి, ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించాలి.

దాదాపుగా నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడగట్టి దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోయాలి. ఈ నీటిని స్కాల్ప్ కు బాగా పట్టేలా స్ప్రే చేయాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం ఉంటుంది.

ఈ నీటిని ఒక సారి తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ చిట్కా చుండ్రును తగ్గించటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Health Facts:మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తున్నారు…ఒంటి గంట దాటుతుందా…ఈ నిజం తెలుసుకోండి

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."