Healthhealth tips in telugu

కేవలం 10 రోజుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం.. మందులు లేకుండానే శాశ్వత పరిష్కారం!

urinary tract infection Home remedies : మూత్రంలో మంట, నొప్పి, మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) సమస్యలతో తరచుగా బాధపడుతున్నారా? అయితే ఇంగ్లీష్ మందుల వాడకం తగ్గించి, ఇంట్లో ఉండే వస్తువులతోనే సహజ పద్ధతిలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

రోజుకు ఒక గ్లాసు చొప్పున 10 రోజుల పాటు ఈ అద్భుతమైన న్యాచురల్ డ్రింక్ తాగితే ఇన్ఫెక్షన్ తగ్గిపోవడమే కాకుండా, భవిష్యత్తులో మళ్లీ రాకుండా ఉంటుంది. ఆ రెమెడీ ఎలా తయారు చేయాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.

యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. అంటే హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్ మరియు వాపుకు గురవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం.
dhaniyalu
దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ధనియాలు యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ధనియాల నీరు ఆయుర్వేదంలోనే అత్యంత శీతల పానీయం అని చెబుతారు. ధనియాల నీటిని ప్రతి రోజు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ ధనియాలను వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి.

ఉసిరిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అరస్పూన్ ఉసిరి పొడిలో అరస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఉసిరికాయలు ఉంటే ఉసిరి రసం తీసి దానిలో తేనె కలిపి తీసుకోవచ్చు. సీజన్ లో ఉసిరి రసం తీసుకోవచ్చు.
అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఉల్లిపాయ కూడా యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్దిగా ఉంటుంది. అలాగే సహజ యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి…ఆ నీటిని వడకట్టి తాగాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."