పెరుగులో ఇది కలిపి రాస్తే చాలు.. ఎంత పలచటి జుట్టు అయినా 15 రోజుల్లో ఒత్తుగా పెరుగుతుంది!
అమ్మాయిలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పొడవైన, అందమైన జుట్టు! కానీ, ఈ రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు రాలడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. జుట్టు రాలకుండా ఉండాలని, పొడవుగా పెరగాలని మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, క్రీమ్స్ వాడుతుంటారు.
కానీ వాటిలోని కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే చేసుకోగలిగే ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా, కాంతివంతంగా పెరుగుతుంది.

ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
భృంగరాజ్ పొడి – 3 స్పూన్లు
ఉసిరి పొడి – 2 స్పూన్లు
ఆలివ్ ఆయిల్ – 2 స్పూన్లు
పెరుగు – 4 స్పూన్లు
ఎలా కలుపుకోవాలి? ఎలా వాడాలి?
ఒక శుభ్రమైన బౌల్ తీసుకుని అందులో భృంగరాజ్ పొడి, ఉసిరి పొడి, ఆలివ్ ఆయిల్, పెరుగు వేసి అన్నీ కలిసేలా మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల (Roots) నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. ప్యాక్ వేసుకున్నాక ఒక గంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత కుంకుడు కాయలతో (లేదా ఏదైనా మైల్డ్ హెర్బల్ షాంపూతో) తలస్నానం చేయాలి.
ఇలా వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటే చాలు.. జుట్టు రాలడం ఆగిపోయి చాలా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు, జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు లాంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ఈ ప్యాక్ ఎందుకంత పవర్ఫుల్ అంటే..
ఉసిరి (Amla): ఆయుర్వేదంలో జుట్టు సమస్యలకు ఉసిరిని బ్రహ్మాస్త్రంలా వాడతారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
పెరుగు (Curd): పెరుగులో ఉండే ప్రోటీన్, విటమిన్ ‘డి’ పోషకాలు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ తలమీద (స్కాల్ప్) ఉండే మృతకణాలను, మురికిని తొలగించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్ (Olive Oil): ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ‘ఇ’ తలమీద చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి. ఇది జుట్టుకు ఒక నాచురల్ కండీషనర్‌లా పనిచేసి, జుట్టు సాఫ్ట్‌గా, షైనీగా ఉండేలా చేస్తుంది.
ఖరీదైన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయిన వారు, ఒకసారి ఈ సింపుల్ అండ్ న్యాచురల్ చిట్కాను పాటించి చూడండి.. మీ జుట్టు సమస్యలన్నీ ఇట్టే మాయం అవుతాయి!
గమనిక: ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు హెయిర్ ఫాల్ సమస్య మరీ తీవ్రంగా ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

