బంగాళాదుంప తింటే లావు అవుతారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
బంగాళదుంప (ఆలూ) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? గ్రేవీ కూరల్లో వేసినా, ఫ్రై చేసినా దాని టేస్టే వేరు. కానీ.. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం బంగాళదుంప అనగానే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఇందులో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి ఆలుగడ్డ తింటే లావైపోతామనే భయం చాలామందిలో ఉంటుంది.
కానీ, ఇది కేవలం అపోహ మాత్రమేనని, సరైన పద్ధతిలో తింటే బంగాళదుంపతో బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం!
ఆకలిని అదుపులో ఉంచుతుంది: బంగాళదుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్నప్పుడు కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు, ఇది మన శరీరంలో ‘కొలిసిస్టోకినిన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు, తద్వారా మనం తీసుకునే ఆహారం ఆటోమెటిక్‌గా తగ్గుతుంది.

కొవ్వును కరిగిస్తుంది: ఇందులో ‘పాలీఫెనాల్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచి, అదనపు కొవ్వు కణాలను కరిగించడంలో బాగా సహాయపడతాయి.
మరెన్నో లాభాలు: బరువు తగ్గించడమే కాకుండా.. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. ఇందులోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలను బలోపేతం చేసి కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం ఇస్తాయి.
మరి ఎలా తినాలి?
ఇవన్నీ చదివి కదా అని ఇష్టమొచ్చినట్టు బంగాళదుంపలు తినేయకండి. బరువు తగ్గాలంటే బంగాళదుంపను ఉడికించి మాత్రమే లిమిట్‌గా తినాలి. అంతే తప్ప నూనెలో వేయించిన ఫ్రైలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు చిప్స్ లాంటివి లాగిస్తే మాత్రం బరువు తగ్గడం కాదు కదా.. మరింత పెరుగుతారు.
ఏదైనా మితంగా తింటేనే ఔషధం, ఎక్కువైతే అనర్థమే కదా! కాబట్టి సరైన మోతాదులో, సరైన పద్ధతిలో ఉడికించిన బంగాళదుంపను మీ డైట్‌లో చేర్చుకుని రిజల్ట్ చూడండి.
గమనిక: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

