ఆరోగ్యానికి అమృతం ఈ ‘తెల్ల వంకాయ’.. ప్రయోజనాలు తెలిస్తే ఈరోజే మార్కెట్ కి పరుగెడతారు
White Brinjal Benefits In telugu : సాధారణంగా మనం పర్పుల్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే వంకాయలను చూస్తుంటాం. కానీ తెల్ల వంకాయ (White Eggplant) ఎప్పుడైనా చూశారా? ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తెల్ల వంకాయ ఎలా సహాయపడుతుందో, దీని వల్ల కలిగే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
మనం సాదరణంగా వైలెట్ కలర్ వంకాయ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే వంకాయలను వండుకుంటూ ఉంటాము. అయితే తెల్ల వంకాయలు గురించి మీకు తెలుసా…తెల్ల వంకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తెల్ల వంకాయలో అధిక మొత్తంలో పొటాషియం లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి, మెగ్నీషియం మరియు కాపర్ కూడా సమృద్దిగా ఉంటాయి.
బరువు తగ్గించటంలో తెల్ల వంకాయలు చాలా బాగా సహాయపడతాయి. ఇందులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ఎక్కువ సమయం కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు.
అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తెల్ల వంకాయలో ఉండే ఫైబర్ మరియు మెగ్నీషియం అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
అంతేకాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. తెల్ల వంకాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. తెల్ల వంకాయలలో ఫైటోన్యూట్రియెంట్స్ అనే సహజ రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇది శరీరం మరియు మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉండుట వలన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

