‘పరుగు’ సినిమాలో బన్నీ మరదలిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తోందో చూడండి!
Parugu heroine sheela kaur :అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా ‘పరుగు’లో మీనాక్షి పాత్రలో మెప్పించిన హీరోయిన్ షీలా కౌర్ గుర్తుందా? సినిమాలకు దూరమైన తర్వాత ఆమె ఏం చేస్తోంది, ఇప్పుడు ఎలా ఉందో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
అల్లు అర్జున్ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన sheela kaur చాలా తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమకు దూరంగా వెళ్ళింది. సినిమా రంగంలో వచ్చిన వాళ్ళందరూ రాణించలేరు.
కొందరికి ఛాన్సులు రావు, కొందరికీ వచ్చినా సెలక్ట్ చేసుకోవడంలో తేడా వలన ఎక్కువకాలం నిలబడలేరు. అదే విధంగా హీరోయిన్ షీలా కౌర్ కూడా ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది.
ఇంతకీ ఆమె ఎవరంటే, టాలీవుడ్ లో ఆ ఆమధ్య తీసిన సీతాకోక చిలుక మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షీలా 2008లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కూడా నటించి మంచి ఛాన్స్ కొట్టేసింది. అయినా తర్వాత పెద్దగా రాణించలేదు. మస్కా, అదుర్స్, పరమ వీర చక్ర వంటి మూవీస్ లో చేసింది.
ఇక కన్నడ, మలయాళం, తమిళం, హిందీ మూవీస్ లో నటించిన షీలా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేక పోయింది. ఇక సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని మేరేజ్ చేసుకుని, వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. 2018లో హైపర్ మూవీలో నటించడమే ఆమె చివరి చిత్రం. ఇక సినిమాల్లో ఛాన్స్ లు కూడా రాకపోవడంతో బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది.
సినిమాలకు దూరమైన తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల పాటు మీడియా కంటపడకుండా ప్రైవేట్ లైఫ్ గడిపింది షీలా. ఎట్టకేలకు 2020 మార్చిలో చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి (Santosh Reddy) ని పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. వీరి వివాహం చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
పెళ్లి తర్వాత చెన్నైలోనే స్థిరపడిన షీలా కౌర్, పూర్తిగా తన ఫ్యామిలీ లైఫ్కే పరిమితమైంది. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. ఒకప్పుడు సినిమాలతో బిజీగా గడిపిన ఈ భామ.. ఇప్పుడు ఒక సాధారణ గృహిణిగా తన భర్త వ్యాపార వ్యవహారాలలో చేదోడువాదోడుగా ఉంటూ, పాప ఆలనాపాలనా చూసుకుంటోంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

