MoviesTollywood news in telugu

సుమకు యాంకరింగ్ నేర్పిన అసలు గురువు ఎవరో తెలుసా? పేరు వింటే ఆశ్చర్యపోతారు!

Telugu Top Anchor Suma : తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా నంబర్ 1 యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాలకు యాంకరింగ్‌లో ఓనమాలు నేర్పిన గురువు ఎవరు? ఆమె కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రతి రోజు Tv లో ఎదో ఒక కార్యక్రమంలో కనపడుతూ ఉంటుంది. పేరుకి మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో అలవోకగా మాట్లాడేస్తూ, సమయస్ఫూర్తితో జోక్స్ కూడా మేళవించి చెణుకులు విసురుతూ యాంకరింగ్ చేయడంలో సుమ దిట్ట.

అయితే మొదటి సారిగా 1991లో దూరదర్శన్ లో యాంకరింగ్ చేసిన ఈమె ఇన్నాళ్లూ టాప్ వన్ యాంకర్ గా రాణిస్తున్నారంటే, ఇందుకు బలమైన పునాది ఉంటుంది కదా. తెలుగు నేర్చుకుని ఈ స్థాయిలో టాప్ యాంకర్ గా కొనసాగడం వెనక ఈమె కృషి, పట్టుదల అర్ధం చేసుకోవచ్చు.

సినిమా ఈవెంట్ అయినా.. టీవీ షో అయినా.. తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుమ పలు సినిమాల్లోనూ నటించారు.’కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కూడా చేసి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత తాను సినిమాల్లో నటించడం భర్త రాజీవ్ కు ఇష్టం లేకపోవడం వల్లే తనంతట తానే మానేశానని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సుమ వెల్లడించింది.

దాంతో ఇక యాంకరింగ్ లో స్థిరపడిపోయానని చెప్పుకొచ్చిన సుమ ఇంతగా రాణించడానికి కారణం ఎవరో కూడా చెప్పింది. యాంకర్ గా సెన్సాఫ్ హ్యూమర్ తో ఇలా మాట్లడడానికి తన తల్లి కారణమని, చిన్నప్పుడు ఇంట్లో అమ్మ సరదాగా మాట్లాడేదని తనకు కూడా అదే అలవాటైందని, అందుకే యాంకరింగ్ లో తన తొలి గురువు అమ్మ అని సుమ వివరించింది.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."