కృష్ణ ‘అశ్వత్థామ’ మూవీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. అప్పట్లోనే ఊహించని లాభాలు!
Krishna Aswaddhama Full Movie : 1988లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అశ్వత్థామ’. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్, విజయశాంతి గ్లామర్, చక్రవర్తి సూపర్ హిట్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది.
ఒక సాధారణ బస్సు డ్రైవర్ అన్యాయంపై తిరగబడి ఎలా ఎదిగాడనే కథతో వచ్చిన ఈ చిత్రం, నిర్మాతలకు కలలో కూడా ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. అసలు ఈ సినిమా తెరవెనుక జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి? బడ్జెట్ ఎంత? ఫైనల్‌గా ఎన్ని కోట్ల లాభం సాధించింది? వంటి నమ్మలేని నిజాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో కొన్ని చిత్ర విచిత్రాలు ఉంటాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ కి డైరెక్షన్ చేసిన బి గోపాల్ నిజానికి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. చిన్నప్పటి నుంచి కృష్ణ సినిమాలు ఎక్కువ చూసేవారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక, కృష్ణ నటించిన పెద్దలు మారాలి మూవీకి అసిస్టెంట్ గా చేసాడు.
తరవాత కె రాఘవేంద్రరావు దగ్గర చేరి అడవిరాముడు మూవీకి పని చేసారు. ఆతర్వాత కృష్ణ నటించిన ఘరానా దొంగ,అడవి సింహాలు,అగ్ని పర్వతం మూవీస్ కి అసోసియేట్ గా చేసారు. దీంతో కృష్ణ బి గోపాల్ మధ్య సానిహిత్యం పెరిగింది. అయితే ప్రతిధ్వని మూవీతో డైరెక్టర్ గా మారిన బి గోపాల్ కి హీరో కృష్ణకి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.
రెగ్యులర్ నిర్మాత,దర్శకులకు డేట్స్ ఇస్తూ కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో కృష్ణ దిట్ట.అలా కొందరు సాంకేతిక నిపుణులు సైతం కృష్ణ ఎంకరేజ్ మెంట్ తో ప్రొడ్యూసర్స్ అయ్యారు. కాస్ట్యూమ్స్ కృష్ణ, శేఖర్ లాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన కృష్ణ, హీరో కృష్ణ మూవీస్ స్పెషల్ గా వర్క్ చేసేవారు.
ఇక ప్రొడక్షన్ లో పనిచేసే శేఖర్ ఇద్దరు కల్సి కృష్ణతో సినిమా తీయాలని భావించారు. కృష్ణ ఒకే చెప్పడంతో డైరెక్టర్ గా బి గోపాల్ ని సెలక్ట్ చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కి కథ అప్పగించడంతో హీరో కృష్ణను దృష్టిలో పెట్టుకుని కథ ను రూపొందించారు. డ్రైవర్ గా కృష్ణ నటించగా, కష్టమ్స్ ఆఫీసర్ గా విజయశాంతి నటించింది. ఆమెకు ఓ ఫైట్ కూడా పెట్టారు.
జగ్గయ్య పవర్ ఫుల్ పాత్ర వేశారు. ఊర్వశి శారద కీలక పాత్ర వేసింది. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకి వెనుకాడకుండా బడ్జెట్ వెచ్చించారు. 1988జులై 28న రిలీజైన ఈ మూవీ ఘనవిజయం అందుకుంది. అలా బి గోపాల్,సూపర్ స్టార్ కృష్ణ తొలి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

