MoviesTollywood news in telugu

1992 సంక్రాంతి బరిలో ‘చంటి’ ధాటికి బలైన సినిమాలేవో తెలుసా?

Victory Venkatesh Chanti Movie : 1992 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘చంటి’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమాయకపు చంటిగా వెంకటేష్ నటన, మీనా అందం, ఇళయరాజా ప్రాణం పోసిన పాటలు వెరసి ఈ చిత్రాన్ని ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి.

అయితే, ‘చంటి’ లాంటి ఎమోషనల్ సునామీ బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడినప్పుడు, అదే సమయంలో పోటీగా రిలీజ్ అయిన నాగార్జున ‘కిల్లర్’ వంటి ఇతర సినిమాల పరిస్థితి ఏమైంది? అసలు ఆ సంక్రాంతి బరిలో ‘చంటి’ ధాటికి ఏయే సినిమాలు నిలబడ్డాయి? ఏవి కొట్టుకుపోయాయి? అనే ఆసక్తికరమైన బాక్సాఫీస్ విశేషాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
chanti movie
venkatesh తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసాడు. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన చంటి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తమిళ చిన్నతంబి మూవీకి రీమేక్ గా వచ్చిన చంటి మూవీని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. 1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజయింది. సుజాత, నాజర్, మంజుల తదితరులు నటించిన ఈ మూవీలో అమాయక క్యారెక్టర్ లో వెంకటేష్ అదరగొట్టాడు.

ఇళయరాజా అద్భుత మ్యూజిక్ ఇచ్చాడు. బెస్ట్ సింగర్ గా బాలు, బెస్ట్ యాక్టర్ గా నాజర్, బెస్ట్ గీత రచయితగా వేటూరి లకు అవార్డులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 4థియేటర్లలో రిలీజై, తొలిసారి రికార్డు నెలకొల్పింది. చంటి 33 సెంటర్స్ లో డైరెక్ట్ గా, షిఫ్ట్ లతో 40పైగా సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 9కోట్ల షేర్ రాబట్టింది.

సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. చంటి రిలీజ్ అయిన రోజే నాగార్జున నటించిన కిల్లర్ మూవీ రిలీజయింది. ఎమోషన్, లవ్ స్టోరీలో వచ్చిన ఈ మూవీలో నాగార్జున, నగ్మా, శారద కీలక పాత్రల్లో చేసారు. నటీ నటులు తమ నటనతో అదరగొట్టగా, ఇళయరాజా తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు.

ప్రియా ప్రియా తమ రాగాలు అనే సాంగ్ సూపర్ హిట్. మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన రక్తతర్పణం మూవీ నిరాశ పరిచింది. కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో వర్ష హీరోయిన్ గా చేసింది.

కాగా రాజేంద్రప్రసాద్ నటించిన అప్పుల అప్పారావు జనవరి 24న రిలీజయింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది. చంటి బిగ్గెస్ట్ హిట్ తో నెంబర్ వన్ కాగా, అప్పుల అప్పారావు సెకండ్ ప్లేస్ లో వచ్చింది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."