బాలయ్య, నాగార్జున మధ్య అసలు పోటీ ఏ సినిమాతో మొదలైందో తెలుసా?
Nagarjuna And Balakrishna Movies : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత అంతటి స్థాయిలో తమ కుటుంబాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన హీరోలు నందమూరి బాలకృష్ణ మరియు అక్కినేని నాగార్జున. 1986లో బాలయ్య వరుసగా ఆరు బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సమయంలోనే, ‘విక్రమ్’ సినిమాతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
అప్పటి నుండి వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడల్లా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనేది. అసలు వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీకి బీజం ఎప్పుడు పడింది? 80, 90వ దశకాల్లో వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన బాక్సాఫీస్ క్లాష్‌లు ఏంటి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం

టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ ఉండటం సహజమే. ఆ పోటి ఆరోగ్యకరంగా ఉండాలి. అగ్ర నటులు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. కానీ మంచి మిత్రులుగా కొనసాగారు. ఇక వాళ్ళ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, నాగార్జున కూడా ఒకానొక దశలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. నిజానికి బాలయ్య టాలీవుడ్ కి ముందుగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ గట్టిగానే నడిచింది.
ఇక బాలయ్య, నాగ్ ల మధ్య 1987లో గట్టి పోటీ నడిచింది. బాలయ్య హీరోగా నటించిన ఏ కోందండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన భార్గవ రాముడు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజయింది. ఒక నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. విజయశాంతి, మందాకినీ హీరోయిన్స్ గా నటించారు.
ఇక నాగ్ నటించిన మజ్ను మూవీ కూడా అప్పుడే రిలీజయింది. దర్శక రత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజనీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ భార్గవరాముడు ఓపెనింగ్స్ బాగున్నా రన్నింగ్ లో ఆగింది. అలా బాలయ్యతో పోటీపడి నాగ్ పైచేయి సాధించాడు. అయితే అంతకు ముందు ఎపుడూ పోటీ పడలేదు. పైగా తమ మధ్య విబేధాలు లేవని కూడా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

