వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో అర స్పూన్ ఇది కలిపి తింటే.. షుగర్ ఉన్నవారి శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
Diabetes Home Remedies In telugu :నేటి కాలంలో ఇంటికొకరు డయాబెటిస్ (మధుమేహం / షుగర్) సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉండే అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే.. కడుపు నిండా అన్నం (White Rice) తినలేకపోవడం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల, తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అందుకే చాలామంది అన్నం మానేసి చపాతీలు, మిల్లెట్స్ తింటుంటారు.
కానీ, మన తెలుగు వారికి పట్టెడు అన్నం తినకపోతే కడుపు నిండిన భావన కలగదు. అయితే ఇకపై షుగర్ ఉన్నవారు అన్నం తినడానికి భయపడాల్సిన అవసరం లేదు! మన వంటింట్లో ఉండే సహజసిద్ధమైన దినుసులతో తయారుచేసిన ఈ ప్రత్యేకమైన పొడిని కేవలం అర స్పూన్ వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో కలుపుకుని తింటే చాలు.. షుగర్ ఉన్నవారికి ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
ఆ అద్భుతమైన పొడి ఏంటి? అది షుగర్‌ను ఎలా నియంత్రిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం:
మెంతులను మన వంటింట్లో రెగ్యులర్ గా వంటల్లో వాడుతూ ఉంటాం. కాస్త చేదుగా ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో వాడుతూ ఉంటాం. మెంతులు వంటలకు మంచి రుచిని అందిస్తాయి. మెంతులు డయాబెటిస్ చికిత్సలో చాలా బాగా సహాయపడుతాయి.

మెంతులను ఎక్కువగా ఆయుర్వేద వైద్య నిపుణులు సిఫార్సు చేస్తూ ఉంటారు. డయాబెటిస్ అంటే మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులను వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
మెంతులను కూడా ప్రతి రోజు పావు స్పూను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదా పావు స్పూను పొడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. మెంతులను వేగించి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. మెంతులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియను కార్బోహైడ్రేట్స్ మరియు చక్కెరలను శరీరం నిదానంగా గ్రహించేలా చేస్తుంది.
ఈ మధ్యకాలంలో మెంతుల గురించి చాలా పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో డయాబెటిస్ ని నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయని తేలింది. ప్రతిరోజు మెంతులను తీసుకుంటూ ఉంటే టాబ్లెట్ మోతాదు పెంచవలసిన అవసరం ఉండదు. డాక్టర్ సూచించిన మందులను వాడుతూ మెంతులను కూడా తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.
మెంతులను ప్రతి రోజు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

