ఉదయాన్నే పరగడుపున ఈ 2 ఆకులు నమిలితే చాలు.. ఆ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరార్!
guava leaves benefits In Telugu :మన చుట్టూ ఉండే ప్రకృతిలో, మన పెరట్లో దొరికే ఎన్నో రకాల ఆకులలో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో మనం వాటిని పట్టించుకోకుండా చిన్న చిన్న సమస్యలకు కూడా ఇంగ్లీష్ మందులపై ఆధారపడుతున్నాం. ఆయుర్వేదం ప్రకారం, ఉదయాన్నే నిద్రలేవగానే పరగడుపున (Empty Stomach) కేవలం రెండు పచ్చి ఆకులను నమిలి తింటే శరీరంలో ఊహించని అద్భుత మార్పులు జరుగుతాయి.
ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. పరగడుపున ఈ ఆకులను తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… వాటి ఆకులలోనూ చాలా ప్రయోజనాలు దాగిఉన్నాయి. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి.

జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం జామ ఆకుల రసం తాగితే… మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి.
చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే మంచిది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే.
ఈ నీరు రుచిగా ఉండకపోయినా… ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను చంపేసి… గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, ఫైబర్… గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి.
హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. పీరియడ్స్ టైమ్లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు.
జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్స్ మేలు చేస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

