Healthhealth tips in telugu

వంటల్లో వాడే నువ్వులతో ఇన్ని లాభాలా? ముఖ్యంగా మహిళలకు ఇది ఒక వరం!

Nuvvulu Health benefits In Telugu : మన వంటగదుల్లో ప్రతిరోజూ ఉపయోగించే ‘నువ్వులు’ కేవలం వంటల రుచిని పెంచడానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు నువ్వులు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం మరియు వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటిలో కాల్షియం, ఐరన్, జింక్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, మరియు పీరియడ్స్ సమస్యలు సులువుగా దూరమవుతాయి.

అసలు రోజూ నువ్వులు తినడం వల్ల మహిళలకు కలిగే ఆశ్చర్యకరమైన లాభాలు ఏంటి? అందం మరియు ఆరోగ్య పరిరక్షణ కోసం వీటిని డైట్‌లో ఎలా చేర్చుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

ప్రతి రోజు వంటలలో ఉపయోగించే నువ్వులు రుచితో పాటు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయన్న సంగతి చాలా మంది స్త్రీలకు తెలియదు. నువ్వులు తింటే వేడి చేస్తాయని,త్వరగా అరగావని ఒక అపోహ చాలా మందిలో ఉన్నది. అయితే మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందనే విషయం నూటికి నూరు పాళ్ళ నిజం.

స్త్రీలు తరచూ ఎదుర్కొనే హార్మోన్ల సమస్యను నివారిస్తుంది. ఋతుక్రమ సమస్యలతో బాధపడేవారు,రుతుక్రమానికి వారం లేదా పది రోజుల ముందు నువ్వులను పొడి చేసి దానిలో బెల్లం లేదా ఇంగువ కలిపి తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నడుమునొప్పి,కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

కండరాల బలహీనతతో బాధపడే పెద్దవారు, ఆస్టియోఫ్లోరోసిస్ తో బాధపడేవారు,ఎదుగుదల సక్రమంగా లేని పిల్లలకు ఈ విధంగా ఇస్తే మంచి పలితం కనపడుతుంది. ముందు రోజు ఒక స్పూన్ నువ్వులను నానబెట్టి ఉదయాన్నే ఆ నువ్వులను పాలతో కలిపి తీసుకొంటే వీరి సమస్య పరిష్కారం అవుతుంది. రక్త హీనతతో బాధపడే పిల్లలకు,పెద్దవారికి ఇదొక టానిక్ లాగా పనిచేస్తుంది.

రాత్రి సమయంలో నానబెట్టిన నువ్వులను ఉదయాన్నే పరగడుపున తినాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే రక్త హీనత నుండి బయట పడవచ్చు. నువ్వులను నేరుగా లేదా ఆహారం ద్వారా తీసుకోవటం వలన అధిక రక్తపోటు,లివర్ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ముఖం మీద ముడతలు మరియు మచ్చలు ఉన్నవారు ప్రతి రోజు స్నానానికి ముందు ముఖానికి నువ్వుల నూనె పట్టించాలి.

అరగంట తర్వాత శనగ పిండి తో రుద్దితే మీ చర్మం నిగనిగలాడుతూ ముడతలు మరియు మచ్చలు క్రమేపి తగ్గుతాయి. నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. పావు కప్పు పాలలో లభించే కాల్షియం కన్నా పావు కప్పు నువ్వులలో ఉండే కాల్షియం మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
కాబట్టి ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."