బ్యూటీ పార్లర్ పనే లేదు.. పసుపులో ఈ రెండు కలిపి రాస్తే మీ ముఖం తళతళా మెరవడం గ్యారెంటీ!
Face Glow Tips:ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ పోగొట్టి మీ చర్మం కాంతివంతంగా, తెల్లగా మెరవాలంటే పసుపులో ఈ రెండు వస్తువులను కలిపి ప్యాక్‌లా వేసుకోండి. మీ ముఖాన్ని ఇన్‌స్టంట్‌గా గ్లో చేసే ఆ అద్భుతమైన బ్యూటీ సీక్రెట్ ఏంటో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా చదవండి.
పసుపులో ఈ రెండింటిని కలిపి రాస్తే ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా మెరిసిపోతుంది.. ఎండ, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా, నల్లగా మారుతూ ఉంటుంది. అలాంటి ముఖాన్ని అందంగా జిడ్డు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ రోజు ఒక చిట్కా ద్వారా తెలుసుకుందాం. ఈ చిట్కా చర్మంపై జిడ్డును తొలగించటమే కాకుండా చర్మంపై ఉన్న మృత కణాలను కూడా సమర్ధవంతంగా తొలగిస్తుంది.

ఇప్పుడు చెప్పబోయే పేస్ ప్యాక్ ముఖాన్ని పెయిర్ గా కాంతివంతంగా మారుస్తుంది. ఈ పేస్ ప్యాక్ కోసం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవన్నీ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
పసుపు
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి చాలా మంచి చేస్తాయి. పసుపు ముఖంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది.
నిమ్మరసం
నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మంపై పెరుకుపోయిన జిడ్డు,టాన్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. ముఖాన్ని తాజాగా కాంతివంతంగా చేస్తుంది. బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖం మీద మచ్చలు లేకుండా మెరిసేలా చేస్తుంది.
పెరుగు
పెరుగు చర్మంపై ఉన్న టాన్,నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాక ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఆయిల్ స్కిన్ వారు అయితే మీగడ లేని పెరుగును తీసుకోవాలి.
ఒక బౌల్ లో చిటికెడు పసుపు,ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక సాదరణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

