Healthhealth tips in telugu

నిద్ర పట్టట్లేదా? రాత్రి ఈ పొరపాటు అస్సలు చేయకండి!

Orange Health benefits in telugu :మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత లేదంటే రాత్రి పడుకోవడానికి ముందు పండ్లను తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లను రాత్రి పడుకోవడానికి ముందు తినకూడదు వాటిలో ముఖ్యంగా కమల పండు ఒకటి. ఈ పండును రాత్రి పడుకోవడానికి ముందు తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు వస్తాయి.

ఏ సీజన్ లో దొరికే ఆ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకోవటం వలన ఆ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.వాటిలో కమలా పండ్ల గురించి తెలుసుకుందాం. కమలా పళ్ళు, సిట్రస్ జాతికి చెందినవి.
Orange Juice benefits
అందువల్ల వీటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. అయితే రాత్రి సమయంలో కమలా పండు తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నిర్వహించడానికి మరియు హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లలో చక్కెర మరియు విటమిన్ సి అధికంగా ఉండుట వలన రాత్రి సమయంలో తింటే నిద్ర సరిగా పట్టక నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందు కమలా పండు తినవచ్చు. ఎందుకంటే సిట్రస్ పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజపరిచి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.

అయితే మనలో చాలా మందికి కమలా పండు ఏ సమయంలో తింటే మంచిది…అనే విషయంలో సందేహం ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినవచ్చు. అలాగే పరగడుపున తినకూడదు. ఈ పండులో విటమిన్ సి మరియు పొటాషియంతో సహా కీలకమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.

అందువలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు ఒక కమలా పండు తింటే శరీరానికి అవసరమైన ఐరన్ అంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కమలా పండులో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. విటమిన్ B6 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఏదైనా పండును లిమిట్ గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. లిమిట్ గా తీసుకుంటే ఆ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాగే తిస్కోనే సమస్యం కూడా ముఖ్యమే..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."