Beauty Tips

జుట్టు రాలడం ఆగిపోయి, వేగంగా పెరగాలా? అయితే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాసి చూడండి!

Hair Care Tips:జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా? అయితే కొబ్బరి నూనెలో ఈ ఒక్క పదార్థం 1 స్పూన్ కలిపి జుట్టుకు రాస్తే, కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం ఆగి వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఆ అద్భుతమైన హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా చదవండి.

కొబ్బరి నూనెలో 1 స్పూన్ కలిపి జుట్టుకి రాస్తే …7 రోజుల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది.. ఈ సీజన్ లో జుట్టు పట్ల శ్రద్ద పెట్టాలి. అంతేకాక దురద, చుండ్రు వంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు తగ్గటానికి మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతో తయారుచేసుకొనే నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెను తయారుచేయటం చాలా సులువు.

మిక్సీ జార్ లో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు, ఒక స్పూన్ మెంతులు, అర స్పూన్ మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో 100 ml కొబ్బరి నూనె పోసి దానిలో మనం తయారు చేసుకున్న పొడిని కలిపి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఈ నూనె బాగా మరిగిన తర్వాత రంగు మారుతుంది.

అప్పుడు పొయ్యి మీద నుంచి కిందకు దించి చల్లారాక వడగట్టి సీసాలో నిలువ చేసుకోవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. రెండు గంటల పాటు అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

కలోంజి గింజలు జుట్టు పెరగడానికి బాగా సహాయపడతాయి. మెంతులు జుట్టుకు ఒక కండిషనర్ గా పని చేస్తాయి. దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. మిరియాలు కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది.

జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పిన ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."